BigTV English
Advertisement

Baahubali: The Epic Cut Scenes: బాహుబలి రీ రిలీజ్.. అవంతికతో ఫాటు జక్కన్న ఫేవరేట్ సాంగ్ కట్, మొత్తం నిడివి ఎంతంటే

Baahubali: The Epic Cut Scenes: బాహుబలి రీ రిలీజ్.. అవంతికతో ఫాటు జక్కన్న ఫేవరేట్ సాంగ్ కట్, మొత్తం నిడివి ఎంతంటే


Baahubali: The Epic Cut Scenes: పాన్ ఇండియా ట్రెండ్ ని పరిచయం చేస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి మూవీ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించింది. 2015 బాహుబలి ది బిగినింగ్, 2017లో బాహుబలి ది కన్ క్లూజన్ పేరుతో రెండు భాగాలుగా సినిమా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అవంతిక లవ్ స్టోరీ పోయింది..

ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానా బాహుబలి రీ రిలీజ్ ని ప్రమోట్ చేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఇందులో మూవీ విశేషాలు, షూటింగ్ టైంలో జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ మూవీపై ఆసక్తి పెంచారు. రెండు భాగాలున్న ఈ చిత్రాన్ని ఎలా విడుదల చేస్తున్నారని ప్రభాస్ జక్కన్నను అడగ్గా. ఆయన అసలు విషయం చెప్పారు. రీ రిలీజ్ చేస్తున్న ఈ సినిమా 3 గంటల 43 నిమిషాల నిడివి ఉంది. ఇందులో అవంతిక ప్రేమకథను తొలగించినట్టు చెప్పారు. అంటే రీ రిలీజ్ లో శివుడి పాత్ర పెద్దగా కనిపించదు. అలాగే పచ్చబొట్టేసిన పాట, కన్ననిదురించిన (రాజమౌళి ఫేవరేట్ సాంగ్), ఇరుక్కుపో సాంగ్ తో పాటు వార్ లోని పలు సన్నివేశాలు కట్ చేసినట్టు స్వయంగా రాజమౌళిని చెప్పారు.


Also Read: Shiva Re Release: శివ సినిమా కోసం వర్మ భారీ కుట్ర.. ఆ డైరెక్టర్ ని తప్పించి..

ఫైనల్ గా బాహుబలి అంటే ఏంటో చెప్పే పర్ఫెక్ట్ సీన్లను మాత్రమే ఇందులో ఉంచి సినిమా మూడున్నరపైగా గంటలకు కుదించారట. అయితే ది బాహుబలి ఎపిక్ లో మెయిన్ మెయిన్ పాటలనే తొలగించారని తేలిపోయింది. కాగా ఈ సినిమా కోసం మూవీ లవర్స్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడుగంటల మూవీని మూడున్నర గంటల్లో ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనేది ఆడియన్స్ ఆసక్తి నెలకొంది. ఇందులో ఏమేమి సీన్స్ కట్ చేస్తారు. కొత్తగా ఏం యాడ్ చేస్తున్నారనే దానిపై ప్రేక్షకులంత క్యూరియాసిటీగా ఉన్నారు. 

డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్

ఈ క్రమంలో సినిమాలో కట్ సీన్స్ ఏవేవో స్వయంగా రాజమౌళి మాటలో వినడంతో ప్రేక్షకులంత కాస్తా రిలాక్స్ అవుతున్నారు. కానీ, సినిమాకే గ్లామర్ టచ్ ఇచ్చిన పచ్చబొట్టేసిన, కన్నా నిదురించరా, ఇరుక్కుపో పాటలనే తీసేయడంతో ఫ్యాన్స్ ని కాస్తా నిరాశ పరుస్తుంది. కాగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టిన బాహుబలి సినిమాకు హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యాయి. ఇందులో కట్టప్ప, శివగామి, భళ్లాలదేవ, దేవసేన పాత్రలు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ముఖ్యంగా శివగామి పాత్రతో రమ్యకృష్ణ అమాంతం పెరిగింది. బాహుబలి సినిమా ఎంతటి విజయం సాధించిందో శివగామి పాత్రకు అంతటి గుర్తింపు లభించింది. 

Related News

Raviteja : నా తుదిశ్వాస అక్కడే జరగాలి.. ఎమోషనల్ అయిన రవితేజ!

Bahubalu : ఏంటీ  బాహుబలి 1 కంటే 2 ముందు షూట్ చేశారా..ఫస్ట్ సీన్ అదేనా?

Prabhas: ఏంటి ప్రభాస్ చిన్నప్పుడు చదువుకోలేదా… 10 పెద్దదా? 7 పెద్దదా?

Rajamouli: బాహుబలి 1&2 లో రాజమౌళికి నచ్చిన సీన్స్ ఇవే…అద్భుతం అంటూ!

Prabhas -SSMB 29: SSMB 29 ఎక్సైట్ గా ఉన్న ప్రభాస్.. ఫస్ట్ హాఫ్ క్రేజీ అంటూ!

Mega 158: చిరంజీవికి విలన్ గా బాలీవుడ్ స్టార్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న బాబీ?

Shiva Re Release: శివ సినిమా కోసం వర్మ భారీ కుట్ర.. ఏకంగా ఆ స్టార్ డైరెక్టర్ ని తప్పించి..

Big Stories

×