BigTV English
Advertisement

Prabhas: ఏంటి ప్రభాస్ చిన్నప్పుడు చదువుకోలేదా… 10 పెద్దదా? 7 పెద్దదా?

Prabhas: ఏంటి ప్రభాస్ చిన్నప్పుడు చదువుకోలేదా… 10 పెద్దదా? 7 పెద్దదా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas), రానా(Rana), అనుష్క(Anushka) ప్రధాన పాత్రలలో నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి హీరో రానా ప్రభాస్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.


ఈ పిచ్చోడు ఏంట్రా ఇలా పెట్టాడు..

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా రానా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లోకేషన్ లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగేది అని రానా తెలిపారు. షూటింగ్ లొకేషన్లోకి రాగానే భారీ స్థాయిలో సెట్, క్రేన్లు చూసి తెలియని అనుభూతి కలిగేది అంటూ రానా మాట్లాడేటప్పుడు వెంటనే ప్రభాస్ అందుకుని నాకు కూడా ఈ పిచ్చోడు ఏంటి ఒకేసారి ఇన్ని క్రేన్లు పెట్టాడనే భావన కలిగింది అంటూ కామెంట్ చేశారు. ఇక రానా మాట్లాడుతూ సెట్ లో ఏకంగా 10 భారీ క్రేన్స్ పెట్టాడని చెప్పడంతో వెంటనే ప్రభాస్ 10 ఏంటీ బావా.. సుమారు ఒక 7 క్రేన్లు ఉన్నాయి అంటూ మాట్లాడారు.

ఏంటి డార్లింగ్ చదువుకోలేదా?

ఈ విధంగా ప్రభాస్ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలపై అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు ఏంటి ప్రభాస్ మీరు చిన్నప్పుడు చదువుకోలేదా? 10 కంటే7 పెద్దదా? లేక 10 పెద్దదా? అంటూ కామెంట్లో చేస్తున్నారు. మొత్తానికి బాహుబలి సినిమాకు సంబంధించిన అంశాల గురించి ఈ ముగ్గురు ప్రస్తావిస్తూ సరదాగా మాట్లాడటమే కాకుండా ఈ సినిమాకు భారీ స్థాయిలో హైప్ పెంచేస్తున్నారు. ఏది ఏమైనా రీ రిలీజ్ విషయంలో కూడా రాజమౌళి సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నారని స్పష్టం అవుతుంది.


తొలగించిన సీన్లు..

ఇక ఈ రెండు భాగాలు కలిపి సుమారు మూడు గంటల 45 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను కూడా తొలగించినట్టు రాజమౌళి తెలిపారు. అందులో అవంతిక లవ్ స్టోరీతో పాటు పచ్చబొట్టేసిన పాటను, కన్నా నిదురించురా, కొన్ని యాక్షన్ సన్ని వేషాలు, ఇరుక్కుపో అనే పాటను తొలగించినట్టు రాజమౌళి తెలియచేశారు. ఇలా కొన్ని సన్నివేశాలను తొలగించడమే కాకుండా కొత్త సన్నివేశాలను కూడా ఈ సినిమాలో జత చేసినట్లు వెల్లడించారు. మరి ఆ సన్నివేశాలు ఏంటి అనేది తెలియాలి అంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత బాహుబలి సినిమా సరికొత్తగా మరోసారి వెండి తెరపైకి రాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.

Also Read: Rajamouli: బాహుబలి 1&2 లో రాజమౌళికి నచ్చిన సీన్స్ ఇవే…అద్భుతం అంటూ!

Related News

Thaman : ఒత్తిడిలో ఉన్న తమన్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పై కసరత్తు

Raviteja : నా తుదిశ్వాస అక్కడే జరగాలి.. ఎమోషనల్ అయిన రవితేజ!

Bahubalu : ఏంటీ  బాహుబలి 1 కంటే 2 ముందు షూట్ చేశారా..ఫస్ట్ సీన్ అదేనా?

Rajamouli: బాహుబలి 1&2 లో రాజమౌళికి నచ్చిన సీన్స్ ఇవే…అద్భుతం అంటూ!

Baahubali: The Epic Cut Scenes: బాహుబలి రీ రిలీజ్.. అవంతికతో ఫాటు జక్కన్న ఫేవరేట్ సాంగ్ కట్, మొత్తం నిడివి ఎంతంటే

Prabhas -SSMB 29: SSMB 29 ఎక్సైట్ గా ఉన్న ప్రభాస్.. ఫస్ట్ హాఫ్ క్రేజీ అంటూ!

Mega 158: చిరంజీవికి విలన్ గా బాలీవుడ్ స్టార్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న బాబీ?

Big Stories

×