Khammam DCM Incident: డీసీఎంతో పాటు డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో ఘటన వెలుగులోకి వచ్చింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నా.. వరద నీటిలో డ్రైవర్ అలాగే డీసీఎంను ముందుకు తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లే సరికి డీసీఎం ముందుకు కదలకుండా ఆగిపోయింది. ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో నిమ్మవాగులో డీసీఎంతో పాటు డ్రైవర్ వాగులో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని గాలింపులు చేపట్టారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు స్థానికులు.