Arshdeep Singh: ఆసియా కప్ 2025లో అద్భుత ప్రదర్శనతో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలిచిన టీమిండియా.. నేటి నుండి ఆస్ట్రేలియా తో టి-20 సిరీస్ కి సిద్ధమైంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు నేడు కాన్ బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టి-20 మ్యాచ్ ఆడుతుంది. తాజాగా ఆస్ట్రేలియా తో ముగిసిన వన్డే సిరీస్ ని 1- 2 తేడాతో ఓడిన భారత్.. నేడు టి-20 ఫార్మాట్ లో మాత్రం ఆసియా కప్ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే నేడు జరుగుతన్న ఈ తొలి టి-20 మ్యాచ్ లో జట్టులోని ఆటగాళ్ల ఎంపిక ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో హర్షిత్ రానా కి తుది జట్టులో చోటు కల్పించడం ఇప్పుడు తీవ్ర చర్చలకు దారితీస్తోంది. హర్షిత్ రానా తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో వన్డే లో మినహా.. గత కొన్ని మ్యాచ్ ల నుంచి పెద్దగా పర్ఫార్మ్ చేయడం లేదు. ఆసియా కప్ 2025 టోర్నీలో కూడా ఆశించినంత స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ అతడిని మూడు ఫార్మాట్లలో ఎంపిక చేయడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా విమర్శలు చెలరేగాయి.
అర్షదీప్ సింగ్ లాంటి స్టార్ బౌలర్ ని పక్కన పెట్టి.. హర్షిత్ రానా ని తొలి టి-20 లో ఎంపిక చేయడంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అర్షదీప్ సింగ్ టీమిండియాలో అత్యధిక టి-20 వికెట్లు తీసిన బౌలర్. పంజాబ్ కి చెందిన ఈ ఎడమ చేతివాటం పెసర్ ఇప్పటివరకు ఆడిన 65 టి-20 మ్యాచ్లలో 101 వికెట్లు పడగొట్టాడు. టి-20 ఫార్మాట్ లో అతనికి సూపర్ రికార్డ్ ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టి-20 కోసం అతడిని ఎంపిక చేయలేదు. టీం మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్ కి గురిచేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు క్రీడాభిమానులు. హర్షిత్ రానా పెద్ద తోపా..? అని కామెంట్స్ చేస్తున్నారు.
టాస్ ఓడిన అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా తుది జట్టును ఎంపిక చేయడం తలనొప్పిగా మారిందని అన్నాడు. తొలి టి-20లో మేము మొదట బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నాడు సూర్య కుమార్ యాదవ్. ఈ పిచ్చి చూడడానికి చాలా బాగుందని.. సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ కాస్త స్లో అవుతుందని అనిపిస్తుందన్నాడు. అందుకే మేము టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళమని తెలిపారు. ” మా ప్లేయింగ్ 11 ఎంపిక చేయడం కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడుతున్నారు. ఇందులోనుండి తుది జట్టును ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది” అని చెప్పుకొచ్చాడు.