BigTV English
Advertisement

Shiva Re Release: శివ సినిమా కోసం వర్మ భారీ కుట్ర.. ఏకంగా ఆ స్టార్ డైరెక్టర్ ని తప్పించి..

Shiva Re Release: శివ సినిమా కోసం వర్మ భారీ కుట్ర.. ఏకంగా ఆ స్టార్ డైరెక్టర్ ని తప్పించి..


Ram Gopal Varma About Shiva Movie: అక్కినేని హీరో, టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన యూత్ ఫుల్ యాక్షన్ మూవీ శివ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలిసిందే. ఇండియన్ సినిమా తీరునే మార్చేసింది శివ. అప్పటి వరకు ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకే పరిమితమైన ఇండియన్ సినిమాకు ఫస్ట్ టైం యాక్షన్ పరిచయం చేశాడు. కాలేజీ కుర్రాళ్ల మధ్య ఇగోలు, ఫైట్ లు, కాలేజీ స్టూడెంట్స్ గొడవల్లో రాజకీయాలు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూపించి ట్రెండ్ సెట్ చేశాడు వర్మ. అప్పట్లో శివ యూత్ పై చూపించిన ప్రభావం అంత ఇంత కాదు.  నాగార్జున కెరీర్ లో అప్పట్లోనే మైలు స్టోన్ క్రియేట్ చేసిన ఈ సినిమా 36 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాగే అన్నపూర్ణ స్టూడియో 50 వసంతాలను జరుపుకుంటుంది. ఈ క్రమంలో  సినిమాను నవంబర్ 14న రీ రిలీజ్ చేయబోతున్నారు.

శివ కోసం కుట్రలు చేశా

ఈ క్రమంలో ఈ యూత్ ఫుల్ యాక్షన్ సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీం వరుస ప్రమోషన్స్ చేస్తోంది.తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జర్నలిస్ట్ స్వప్పకు ఇచ్చిన ఇంటర్య్వూలో శివ మూవీకి గురించిన ముచ్చట్లు షేర్ చేశారు. ‘ఈ సినిమా తీయడానికి నేను అన్నపూర్ణ స్టూడియో బయట మూడు గంటలు వేయిట్ చేశాను. కనీసం ఆయన నా వైపు కూడా చూకుండ వెళ్లిపొయారు‘ లాంటి ముచ్చట్లు చెప్పను నేను. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసి ఓ స్టార్ నిన్ను ఎందుకు గుర్తించాలి.  పిలిచి ఆఫర్ ఇచ్చేలా నువ్వు ఏం చేశావు.  చాలా మంది కెరీర్ లో ఎదిగాక.. అవమానాలు పడ్డాను.. గంటల తరబడి ఆఫీసుల బయట పడిగాపులు కాచానని చెబుతారు. అది కరెక్ట్ కాదు. అదే నేను ఓ సినిమా అవకాశం కావాలంటే.. వారే నన్ను పిలిచి అవకాశం ఇచ్చేలా చేసుకోవాలి. శివ సినిమా కోసం అదే చేశాను. ఎన్నో కుట్రలు పన్నాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.


ఫస్ట్ సురేందర్ ని కలిశాను

శివ కథ అనుకోగానే నేరుగా వెళ్లి నేను కథ చెప్పలేదు. నన్ను వారు నమ్మేలా చేసుకున్నాను. నిర్మాత సురేందర్ ని కలవాలి. ఆయన నన్ను కలవరు కాబట్టి ఆయనకు అసిస్టెంట్స్ దగ్గర సురేందర్ కి ఏం ఇష్టం, ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉంటారో తెలుసుకున్న. వారికి దగ్గరయ్యాను. అలా ఓ పార్టీలో సురేందర్ ని కలిసి ఆయన కంపెనీ గురించి ఆయననే తెలుసా అని అడిగాను. అలా ఆయనతో మాటలు కలిపా. సురేందర్ కి మరింత దగ్గరయ్యాను. కొన్ని రోజులకు తన ప్రొడక్షన్ లోనే నాతో ఓ సినిమా చేస్తా అన్నాడు. దానికి నేను సిద్ధం లేకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ తరణిని తీసుకువచ్చి అతడితో సినిమా చేయించాను. అదే టైంలో సురేందర్ తో కలిసి జర్నీ చేసే అవకాశం వచ్చింది. అప్పుడే శివ కోసం మెల్లిమెల్లిగా ప్రయత్నాలు మొదలుపెట్టా.

Also Read: Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

కొదండరామిరెడ్డి వంటి డైరెక్టర్ ని కూడా తప్పించా

కానీ, నేను వారితో సినిమా తీయాలనుకుంటున్న విషయం చెప్పకుండ నా గురించి వారిక తెలిసేలా చేశాను. అదే టైంలో నాగార్జున రావు గారి అబ్బాయి మూవీ చేస్తున్నారు. దాదాపు ఆ చిత్రం అయిపోవచ్చింది. దీంతో వెంటనే కొదండరామిరెడ్డి గారు నాగార్జున తో మూవీ చేసేందుకు స్క్రిప్ట్ అన్ని రెడీ చేసుకుని సిద్దంగా ఉన్నారు. ఆయన ఓ సినిమాతో బిజీగా ఉండటంతో ఆ కథ వినిపించమని చెన్నైకి నన్ను పంపించారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి నేరుగా వెళ్లాల్సి వచ్చింది. కొదండరామిరెడ్డి అంటే చిన్న డైరెక్టర్ కాదు. ఆయన చేతిలో కనీసం ఏడేనిమిది సినిమాలు ఉంటాయి. ఆయన షూటింగ్ చేయనంటు రోజు ఉండదు. ఆయన సినిమా అంటే ఎవరూ నో చెప్పరు. అందుకే ఆ స్క్రిప్ట్ ని నేను అటూ ఇటూ చేసి నాగేశ్వరావు నచ్చకుండ చేశాను. ఆయన ఇదేం స్టోరీ మార్చమని చెప్పండి అన్నారు. అదే వెళ్లి కొదండరామిరెడ్డికి చెప్పాను.

ఫైనల్ గా  శివకు అలా పట్టాలెక్కింది

దీంతో వారు సైలెంట్ అయ్యారు. ఇక ఆయన స్క్రిప్ట్ రెడీ చేసి వచ్చేలోపు నేను నాగార్జున, వెంకట్, సురేందర్ లను శివ సినిమా కోసం రెడీ చేయాలి అనుకున్నా. అలా మెల్లిమెల్లిగా సురేందర్ కే నాతో సినిమా చేయాలనే ఆలోచన వచ్చేలా చేశాను. వారు నాతో ఒక సినిమా చేద్దం అన్నట్టుగానే ఉన్నారు. కానీ, చేసేయాలనే ఆలోచనలో లేరు. వెంకట్ నాగేశ్వరరావులు ఒకే అంటే చూద్దాం అన్నట్టు ఉన్నారు. ఈ విషయం గురించి వాళ్లు ఆయనను కలకముందే నేను వెంకట్ దగ్గరికి వెళ్లి.. నా దగ్గర ఒక కథ ఉంది.. నాగార్జున, సురేందర్ గార్లు ఒకే చెప్పారు. మీరే ఏమంటారు అన్నాను. వాళ్లు ఒకే అంటే నాదేముంది అన్నారు. ఇటూ వెంకట్ గారు ఒకే అన్నడంతో నాగర్జున, సురేందర్ కూడా ఒకే అన్నారు. చివరికి నాగేశ్వరరావు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా శివ సినిమా ముందుకు వెళ్లింది. ఈ చిత్రం నాగార్జునకు, సురేందర్, వెంకట్ లకు మంచి పెద్ద హిట్ ఇస్తుందనే నమ్మకంతోనే ఇదంత చేశాను. అందుకే ఇలా కుట్రలు చేసి, కొదండరామిరెడ్డిని గారిని తప్పించి శివ చిత్రాన్ని పట్టాలెక్కించాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.

Related News

Raviteja : నా తుదిశ్వాస అక్కడే జరగాలి.. ఎమోషనల్ అయిన రవితేజ!

Bahubalu : ఏంటీ  బాహుబలి 1 కంటే 2 ముందు షూట్ చేశారా..ఫస్ట్ సీన్ అదేనా?

Prabhas: ఏంటి ప్రభాస్ చిన్నప్పుడు చదువుకోలేదా… 10 పెద్దదా? 7 పెద్దదా?

Rajamouli: బాహుబలి 1&2 లో రాజమౌళికి నచ్చిన సీన్స్ ఇవే…అద్భుతం అంటూ!

Baahubali: The Epic Cut Scenes: బాహుబలి రీ రిలీజ్.. అవంతికతో ఫాటు జక్కన్న ఫేవరేట్ సాంగ్ కట్, మొత్తం నిడివి ఎంతంటే

Prabhas -SSMB 29: SSMB 29 ఎక్సైట్ గా ఉన్న ప్రభాస్.. ఫస్ట్ హాఫ్ క్రేజీ అంటూ!

Mega 158: చిరంజీవికి విలన్ గా బాలీవుడ్ స్టార్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న బాబీ?

Big Stories

×