Prabhas -SSMB 29: దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న తాజా చిత్రం ఎస్ఎస్ఎంబి29(SSMB 29). ఈ సినిమా ఓ అడ్వెంచర్స్ మూవీగా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో అభిమానులు ఒకవైపు నిరాశ వ్యక్తం చేస్తూనే మరోవైపు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)సైతం ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ గురించి రాజమౌళిని అడగడంతో ఇందుకు సంబంధించిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రానా, ప్రభాస్ హీరోలుగా నటించిన బాహుబలి రెండు భాగాలు ఓకే సినిమాగా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రానా(Rana) ప్రభాస్ తో కలిసి రాజమౌళి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభాస్ రాజమౌళితో మాట్లాడుతూ మరి మీది ఎప్పుడు సర్ నెక్స్ట్ సినిమా అంటూ అడిగారు అయితే ప్రభాస్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పకుండా దాటవేశారు. చిన్న అప్డేట్ ఇవ్వమని అడగడంతో నో కామెంట్స్ అంటూ సమాధానం చెప్పారు.
ఇలా రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని నేపథ్యంలో సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని, క్రేజీ.. మెంటల్ అంతే అంటూ ప్రభాస్ ఈ సినిమాపై హైప్ పెంచేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎక్సైటింగ్.. మెంటల్ ఎక్కిపోతుంది అంతే అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఈ విధంగా ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడమే కాకుండా అభిమానులు కూడా ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ వస్తే బాగుండని ఆశపడుతున్నారు.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా..
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ నవంబర్ 15వ తేదీ వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అతిపెద్ద సినీ వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు మరికొన్ని అప్డేట్స్ వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది.. మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించడం విశేషం. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
Also Read: Mega 158: చిరంజీవికి విలన్ గా బాలీవుడ్ స్టార్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న బాబీ?