Rajamouli: దర్శక ధీరడు ఎస్ ఎస్ రాజమౌళి (ఎస్.Rajamouli) దర్శకత్వంలో సినిమా రాబోతోంది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు జక్కన్న డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో బాహుబలి(Bahubali) సినిమా ఒకటి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic) పేరిట ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కానుంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో రాజమౌళి మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన రానా(Rana), ప్రభాస్(Prabhas) తో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇందులో భాగంగా ఈ సినిమాలో కట్ చేసిన సన్నివేశాల గురించి అలాగే తనకి ఇష్టమైన సన్నివేశాల గురించి, నటీనటుల గురించి రాజమౌళి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి రెండు భాగాలలో రాజమౌళికి నచ్చిన సన్నివేశాలు గురించి కూడా ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
తాను ఒక్కో షాట్ ఎక్కువ టేక్స్ తీసుకొని చేశాను కానీ ఆ సన్నివేశాలను చూస్తున్నప్పుడు నా మనసును హత్తుకున్నాయి అంటూ తెలిపారు. ప్రభాస్ చనిపోయే ముందు “అమ్మ జాగ్రత్త “అంటూ కట్టప్పకు చెప్పే సన్నివేశం ఎమోషనల్ గా అందరిని కట్టిపడేస్తుందని తెలిపారు. ఇక రానా కిరీటం చూస్తూ ఎలాగైనా దీనిని సొంతం చేసుకోవాలి అనే కసి తనలో బాగా కనిపించిందని రాజమౌళి వెల్లడించారు.ఇక కట్టప్ప బాహుబలిని చంపే సమయంలో కత్తిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ సన్నివేశం కూడా తన మనసును హత్తుకుందని రాజమౌళి వెల్లడించారు.
అనుష్క తప్ప ఎవ్వరు చేయలేరు..
ఇక దేవసేన పాత్రలో నటించిన అనుష్క గురించి మాట్లాడుతూ అనుష్క మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో ఒక్కసారిగా మాహిష్మతి వైపు తల పైకెత్తి చూస్తుంది. ఆ సమయంలో ఒక దేవకన్య నేలపైకి వచ్చిందనే భావన తనలో కలిగిందని ఈ పాత్రకు అనుష్క తప్ప మరెవరు సెట్ అవ్వరని రాజమౌళి వెల్లడించారు. ఇక శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ గురించి కూడా మాట్లాడారు. కట్టప్ప వచ్చి బాహుబలిని కుట్ర చేసి చంపారని చెప్పగానే ఆమె కెమెరా వైపు అలా చూస్తూ ఉండే సన్నివేశం కూడా అద్భుతంగా ఉందని తెలిపారు. ఇక నాజర్ శివగామిని చంపుదామా అంటూ రానాతో మాట్లాడే సీన్ కూడా హైలెట్ అని ఈ రెండు భాగాలలో తనకు నచ్చిన సన్నివేశాల గురించి రాజమౌళి ఈ సందర్భంగా తెలియచేయడంతో నిజంగానే రాజమౌళి చెప్పిన సీన్స్ అన్ని సినిమాకే హైలెట్ అయ్యాయి అంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి 10 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Prabhas -SSMB 29: SSMB 29 ఎక్సైట్ గా ఉన్న ప్రభాస్.. ఫస్ట్ హాఫ్ క్రేజీ అంటూ!