Mega 158: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోళా శంకర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి డైరెక్టర్ బాబీ (Bobby) దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. ఈ తరుణంలోనే సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) కూడా నటించబోతున్నారనే వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
చిరంజీవితో పాటు కార్తీ పాత్ర కూడా సినిమా మొత్తం ఉండబోతుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవితో పోటీ పడటానికి బాలీవుడ్ హీరో రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న అనురాగ్ కస్యప్(Anurag Kasyap) ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్న నేపథ్యంలో బాబి పలు భాష సెలబ్రిటీలను ఈ సినిమాలో భాగం చేస్తున్నట్టు తెలుస్తుంది.
చిరంజీవికి జోడిగా నయనతార..
కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కార్తిని ఎంపిక చేశారు. ఇక బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అనురాగ్ కశ్యప్ ను విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలవడునుంది. అయితే ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మరి బాబి ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను టార్గెట్ చేసిన నేపథ్యంలో శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Malavika Mohanan: చిరంజీవి సినిమాలో నటించాలని ఉంది కానీ.. క్లారిటీ ఇచ్చిన మాళవిక!