అండర్ వేర్ అనేది అత్యంత శుభ్రంగా ఉండాలి. అందుకే, ఒక్కో అండర్ వేర్ ను ఒక రోజు మాత్రమే వేసుకుంటారు. ఆ తర్వాత మరొకటి వేసుకుంటారు. ఉతక్కుండా ఒకే అండర్ వేర్ ను రెండు అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు. ఒకవేళ అలా చేస్తే పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
లోదుస్తులు రోజంతా చర్మానికి దగ్గరగా ఉంటాయి. ఇది చెమటకు గురవుతాయి. చనిపోయిన చర్మ కణాలు, బాడీ ఆయిల్స్, బ్యాక్టీరియా లాంటి క్రిములతో నిండిపోయి ఉంటుంది. ఒకే రోజు తర్వాత కూడా అలాగే ధరించి ఉంటే, అనారోగ్యకర క్రిములు అండర్ వేర్ లో పేరుకుపోతాయి. దాన్ని అలాగే ధరిస్తే దుర్వాసన, దురద, అసౌకర్యం కలుగుతుంది. దానిని శుభ్రంగా ఉంచడం వల్ల ఈ సమస్యను నివారించే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య నిపుణులు కూడా అండర్ వేర్ వినియోగం గురించి కీలక విషయాలను వెల్లడించారు. కచ్చితంగా ఒక్క రోజుకు మించి ఉపయోగించకూడదంటున్నారు. ఒకవేళ అలాగే ధరిస్తే స్కిన్ కు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సమస్యను నివారించాలంటే ప్రతిరోజూ లోదుస్తులను మార్చాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) చెప్తోంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ 2018లో ఓ అధ్యయనం గురించి కీలక విషయాలు వెల్లడించింది. ఒక రోజు పాటు ధరించిన తర్వాత లోదుస్తులపై 10,000 కంటే ఎక్కువ బ్యాక్టీరియాలను కనుగొన్నది. రెండు రోజుల తర్వాత 100,000 పైగా ఆ సంఖ్య పెరిగింది. ఉతకని లోదుస్తులను తిరిగి ఉపయోగించడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, జాక్ దురద వచ్చే ప్రమాదం పెరుగుతుందని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ హెచ్చరించింది. 2019 UK సర్వేలో ఐదుగురు పురుషులలో ఒకరు ఒకే జతను రెండు, అంతకంటే ఎక్కువ రోజులు ధరిస్తారని తేలింది. కానీ, వైద్యులు ఈ విధానాన్ని అనారోగ్యకరమైన అలవాటుగా వెల్లడించారు.
ప్రతి రోజూ స్నానం చేసే వారు లో దుస్తులు ఒకరోజు ధరించవచ్చు. రెండవ నాటికి మురికి వాసన వస్తుంది. తేలికపాటి చికాకు కలుగుతుంది. మూడు, అంతకంటే ఎక్కువ రోజుల తర్వాత, ఇన్ఫెక్షన్లల తీవ్రత పెరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు రావచ్చు.
ఒకవేళ సుదూర ప్రయాణం చేయాల్సి రావడం, మరో జత లోదుస్తులు లేకపోతే డిస్పోజబుల్ లోదుస్తులను ఉపయోగించడం మంచిది. ఒకవేళ మీద దగ్గర మరో అండర్ వేర్ లేకపోతే, దాన్నే లోపలికి తిప్పి వేసుకోవడం మంచిది. వీలైనతం వరకు రోజూ లోదుస్తులను మార్చుకోవాలి. వాటిని ఉతికి ఎండలో ఆరబెట్టాలి. కాటన్ ఫాబ్రిక్ లోదుస్తులను ఉపయోగించాలి. ఎందుకంటే, ఇది గాలి ప్రవాహాన్ని అనుమతిస్తుంది. సింథటిక్స్ కంటే చెమటను బాగా పీల్చుకుంటుంది. మంచి లోదుస్తుల మీ చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయి. అందుకే ప్రతి రోజూ లోదుస్తులను కచ్చితంగా మార్చండి!
Read Also: రూ.20 సమోసాకు కక్కుర్తి పడితే.. రూ.3 లక్షలు స్వాహా, తినే ముందు ఆలోచించండి!