Guntur:తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి బాపట్ల ప్రయాణిస్తుంది ఓ ఆర్టీసీ బస్సు. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులకు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.