Glenn Phillips: 90 ల్లో క్రికెట్ చూసిన అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని ఆటగాడు జాంటీ రోడ్స్. ఇతడు పక్షిలా ఎగురుతూ క్యాచ్ లు పట్టేవాడు. పాదరసంలా కదులుతూ జాంటీ రోడ్స్ చేసే ఫీల్డింగ్ విన్యాసాలు క్రికెట్ అభిమానుల మతి పోగొట్టేవి. అతని తరువాత ఎందరో మెరుపు ఫీల్డర్లు వచ్చారు. కానీ జాంటీ రోడ్స్ లాంటి ఫీల్డర్ మాత్రం కనిపించలేదు. కానీ న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ మాత్రం జాంటీ రోడ్స్ ని తలపిస్తాడు.
Also Read: Arshdeep Singh: తొలి టీ-20లో అర్షదీప్ ను తప్పించడంపై ట్రోలింగ్.. హర్షిత్ రాణా పెద్ద తోపా అంటూ !
తన అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తాడు. విస్పోటక బ్యాటింగ్ తో పాటు అసాధారణమైన ఫీలింగ్ ప్రతిభను ప్రదర్శించే ఫిలిప్స్.. తన అపూర్వ క్రీడా నైపుణ్యంతో ఆటకు కొత్త ప్రమాణాలను తీసుకువచ్చాడు. బంతి ఎటు వెళితే అటు.. గోడ కట్టినట్లుగా డైవ్ చేస్తూ పరుగులు అడ్డుకుంటాడు. అద్భుతమైన ఫీల్డింగ్ తో రనౌట్ చేస్తాడు. అలా ఫిట్నెస్ కి కూడా కొత్త అర్థం తీసుకువచ్చాడు.
తాజాగా గ్లెన్ ఫిలిప్స్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన క్రీడాభిమానులు అతడి ఫిట్నెస్ కి సలాం కొడుతున్నారు. మైదానంలో మెరుపు ఫీల్డింగ్, హిట్టింగ్ బ్యాటింగ్ తో పాటు.. మైదానం బయట తన కఠినమైన వర్కౌట్లతో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఫిలిప్స్ తన వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ లో చేసిన వర్కౌట్ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తిన వైరల్ గా మారింది.
ఈ ఫోటోలో తన ప్రియురాలితో కలిసి ఫిలిప్స్ తన రెండు చేతులను నేలపై కాకుండా.. రెండు భారీ డంబెల్స్ పై ఉంచి ఫ్లాంక్ పుషప్స్ చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల అతడి భుజాలు, కండరాలపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ ఫోటోలో ఫిలిప్స్ ప్రియురాలు అతడి వీపుపై పూర్తిగా పడుకుని ఉంది. ఆమె బరువును కూడా సునాయాసంగా మోస్తూ కనిపించాడు ఫిలిప్స్. ఎంతో కష్టతరమైన ఈ ఫీట్ ద్వారా ఫిలిప్స్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఓ సవాల్ విసిరాడని చెప్పవచ్చు.
గ్లెన్ ఫిలిప్స్ యువ ఆటగాళ్లకు ఓ మోటివేషన్. తన ఆటను మెరుగుపరుచుకునేందుకు ఎన్.ఎఫ్.ఎల్, బేస్ బాల్ వంటి ఇతర క్రీడల నుంచి ప్రేరణ పొందుతాడు. బేస్ బాల్ లో ప్లేయర్లు ఎంత వేగంగా త్రో చేస్తారో.. వారి మోషన్ ఎలా ఉంటుందో తెలుసుకొని.. ఫీల్డింగ్ లో తన టెక్నిక్స్ ని మెరుగుపరుచుకుంటాడు. ఇలా సరికొత్త ప్రయోగాలు చేస్తూ రెండు చేతులతో త్రో చేసే ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇక ఖాళీ సమయాలలో ఫ్లైట్ సిమ్యులేటర్ ఉపయోగించి విభిన్న రూట్లలో విమానం నడిపే ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటూ, ఫీల్డింగ్ ని కొత్త ఎత్తుకు తీసుకు వెళ్తూ.. ఫిట్నెస్ పరంగా కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు.