MSVPG : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి అంటేనే ఎంటర్టైన్మెంట్ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనిల్ రావిపూడి ది బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు.
మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో నయనతార శశిరేఖ అనే పాత్రలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా స్వయంగా నయనతార ట్విట్టర్ వేదికగా అప్లోడ్ చేశారు.
ఇప్పటికే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దసరా కానుకగా ఈ సినిమా నుంచి నయనతార కు సంబంధించిన ఒక వీడియో బయటకు రానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి కు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎలా థియేటర్ కు రప్పించాలో బాగా తెలుసు. అందుకని ఎక్కువ శాతం ఆయన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతుంటాయి.
అలా సంక్రాంతి కానుకగా విడుదలైన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా గోదారి గట్టు పైన అనే పాటతో సినిమా మీద హై క్రియేట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి మొత్తం అన్ని సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే ప్రతి సాంగ్ మెగా అనే వర్డ్ తో ఉండబోతుంది అని అధికారికంగా కూడా ప్రకటించారు.
ఒక పాటతోనే హై క్రియేట్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ లో కీలక భాగమైన భీమ్స్, ఇప్పుడు మరోసారి తన సత్తా చూపించనున్నాడు. నిజమైన 2026 సంక్రాంతి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా కూడా విడుదల కానుంది.
Also Read: Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?