Bandla Ganesh Comments on Allu Aravind: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గత రెండు రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్‌కి వచ్చిన ఆయన ఇండస్ట్రీ మాఫియా అంటూ చేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. అప్కమ్మింగ్ యాక్టర్స్‌ని హెచ్చరిస్తూ బండ్లన్న ఇండస్ట్రీని టార్గెట్ చేశాడు. దీంతో బండ్ల గణేష్ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. ఇదే ఈవెంట్ అల్లు అరవింద్ గురించి ఊహించని కామెంట్స్ చేశాడు. ‘షర్టు నలగదు, జుట్టు చదరదు.. కానీ, డబ్బు మాత్రం కూర్చున్న చోటునే ఖాతాలోకి వచ్చి చేరుతుంది‘ అంటూ కామెంట్స్ అంతేకాదు.
ఒక సినిమా పట్ల కష్టం ఒకరిది అయితే.. చివరిలో వచ్చి క్రిడిట్ మొత్తం కొట్టేస్తాడంటూ నవ్వుతూనే.. అల్లు అరవింద్ టార్గెట్ చేశాడు. ఇండస్ట్రీలో అల్లు అరవింద్ మాఫీయా ఇలా ఉందంటూ పొగుడుతూనే పొగపెట్టాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఇక ఇది జరిగి రెండు రోజులు కూడా కాలేదు.. మళ్లీ అల్లు అరవింద్ని టార్గెట్ చేశాడు. ఓ మూవీ ఈవెంట్కి వచ్చిన బండ్ల గణేష్ అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీని చూపిస్తూ ఊహించని కామెంట్స్ చేశాడు. అల్లు బాబీని చూడండి.. తండ్రి మాట విన్నాడు కాబట్టే ఇలా ఉన్నాడు. అదే తండ్రి మాట వినని అల్లు అర్జున్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. తండ్రి మాట విని కష్టపడి చదివాడు. అందుకే ఇలా సామాన్యుడిగా ఉన్నాడు. అదే బన్నీ చూడండి తండ్రి మాట వినకుండ సూపర్ స్టార్ అయ్యాడు.
అందుకే చెబుతున్న వినండి. తండ్రి మాట వినకండి. మీ సొంత నిర్ణయాలు తీసుకుని బాగుపడండి. బాబీ తండ్రి మాట విన్నాడు.. బన్నీ ఈయన మాట విన్నాడు” అంటూ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సరదాగా ఉన్న ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్లన్న ఏంటీ.. అల్లు అరవింద్ మీద పడ్డాడు.. ఆయన పొగుడుతున్నాడా? అల్లు అరవింద్పై పరోక్షంగా కౌంటర్ వేస్తున్నాడా? అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా ఇలా వరుసగా బండ్లన్న.. నిర్మాత అల్లు అరవింద్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆలోచింపేలా ఉన్నాయి. బండ్ల గణేష్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో చెప్పలేం.
#AlluArjun
తండ్రి మాట విననందుకు మా బన్నీ సూపర్ స్టార్ అయ్యాడు – @ganeshbandla #AlluArjun #AlluBobby #BandlaGanesh #AA22 pic.twitter.com/7j4nLIqhuN— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) September 20, 2025
గతంలో ఆకాశ్ పూరి మూవీ ఈవెంట్ వచ్చి పూరీ జగన్నాథ్పై ప్రశ్నలు సంధించాడు. ఎంతోమందిని స్టార్ హీరోలను చేశావు.. కానీ, సొంత కొడుకు సినిమా ఈవెంట్ రాకపోవడమేంటని ప్రశ్నలతో దాడి చేశాడు. అంతేకాదు ఆయన వ్యక్తిగత జీవితం, భార్యతో మనస్పర్థలపై బహిరంగంగా మాట్లాడి బట్టబయలు చేశాడు. ఆ తర్వాత కూడా ఎంతో స్టార్స్ టార్గెట్ చేస్తూ ట్వీట్స్, కామెంట్స్ చేశాడు. ఇక ఓ ఈవెంట్ తన దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ అభిమానం కురిపించాడు. అదే దేవుడు.. ఇక తనకు వద్దని, ఇకపై తాను పవన్ కళ్యాణ్‌కు దూరంగా ఉంటానని కామెంట్స్ చేశాడు. నిన్న“నాయకత్వం అంటే పదవులు ఎక్కడం కాదు, మనల్ని నమ్మి మన చుట్టూ ఉన్నవారిని పైకి తీసుకెళ్లడం” అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇవి జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించేలా ఉన్నాయంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.