Bandla Ganesh: బండ్ల గణేష్(Bandla Ganesh) చేతికి మైక్ దొరికిందంటే చాలు ఆయన మాట్లాడే ప్రతి మాట సంచలనగా మారుతుంది. ఇక ఇటీవల కాలంలో బండ్ల గణేష్ పెద్ద ఎత్తున సినిమా వేడుకలలో పాల్గొంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)హీరోగా నటించిన కే ర్యాంప్(K Ramp) సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ర్యాంపేజ్ బ్లాక్ బాస్టర్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ కిరణ్ అభవరం గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇండస్ట్రీలో మరొక హీరోని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు కూడా కురిపించారు. ఇటీవల కాలంలో ఒక హిట్టు పడితే చాలు అర్ధరాత్రి కూడా కళ్ళజోడు పెట్టుకొని వాట్సాప్ గాయ్స్ అంటూ మాట్లాడతారు. ఒక సినిమా హిట్ అయితే చాలు లోకేష్ కనకరాజ్, రాజమౌళి నా సినిమా వేడుకలకు రావాలి అంటూ మాట్లాడుతారు కానీ కిరణ్ అబ్బవరం అలా కాదు వరుస హిట్ సినిమాలను అందుకుంటున్న ఒదిగే ఉన్నారు. కిరణ్ అబ్బవరాన్ని చూస్తే ఇంట్లో మనిషిలాగ అనిపిస్తారు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.
ఆస్తిని అంతస్తును ఎవరైనా వారసత్వంగా ఇస్తారు .. తెలివిని, సక్సెస్ ను ఎవరూ వారసత్వంగా ఇవ్వలేరని తెలిపారు.దమ్ము కావాలి.. దేవుడి దయ కావాలి..సినిమా అంటే ప్రేమ కావాలి, వాట్స్ అప్ అంటే రాదు హిట్టు రాదు అంటూ ఈయన మాట్లాడారు. కిరణ్ అబ్బవరాన్ని చూస్తుంటే నాకు చిరంజీవి(Chiranjeevi) గారు కెరియర్ మొదటి రోజుల్లో గుర్తుకు వస్తున్నారని చిరంజీవి గారితో కిరణ్ అబ్బవరాన్ని పోలుస్తూ మాట్లాడారు అలాగే రేపో మాపో చిరంజీవి గారికి భారతరత్న (Bharat Ratna) కూడా వస్తుంది అంటూ బండ్ల గణేష్ మాట్లాడారు. ఇలా బండ్ల గణేష్ కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూనే మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపించారని స్పష్టమవుతుంది.
కొత్తవారికి అవకాశం..
కిరణ్ అబ్బవరం ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలు అంటే ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు. అంతేకాకుండా ఈయన నిర్మాతగా మారి కొత్త వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం, తన నిర్మాణంలో రాబోతున్న సినిమాలకు కొత్త నటీనటులకు అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో బండ్ల గణేష్ ఈ విషయంపై కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు.. రిక్వెస్టుల మాత్రమే!