E-Paper
Advertisement

లెనిన్ ని ఆకాశానికి ఎత్తేసిన చిరు …ఇక కలెక్షన్ల వేట షురూ అయ్యేనా ?

లెనిన్ ని ఆకాశానికి ఎత్తేసిన చిరు …ఇక కలెక్షన్ల వేట షురూ అయ్యేనా ?
Advertisement

Akhil Lenin:అన్నీ ఉన్నాయ్ ..ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా. లేనిది ఏదీ లేదు.అందం, ఆస్తి, అండదండలు ..ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయ్ .కానీ ఒక్క సాలిడ్ సక్సెస్ తప్ప. ఇదీ అక్కినేని వారి వారసుడు అఖిల్ తీరు.2015లో ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరోకి కాలం అస్సలు కలిసి రాలేదు.ఈ గ్యాప్ లో వచ్చిన కొత్త హీరోలు ఇండస్ట్రీలో పాతుకుపోయెందుకు ప్రయత్నిస్తే ఈయనగారు మాత్రం ఇంకా ఒక్క హిట్టు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి.

ఏజెంట్ అయితే అందరికి ఒక పీడకల

Advertisement

హలో’, ‘మిస్టర్ మజ్ను,‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ఇలా ఏ సినిమా చేసినా అలా వచ్చి ఇలా పోవడమే కాని బ్లాక్ బస్టర్ ట్యాగ్ ని వేసుకోలేకపోయాయి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాలాతో వచ్చిన ఏజెంట్ అయితే అందరికి ఒక పీడకలనే మిగిల్చింది.దాదాపు మూడేళ్ళ కష్టం, కావాల్సిన మేకోవర్, అన్నింటికీ మించి సిక్స్ ప్యాక్ ..ఇలా ఏమేం కావాలో అన్నీ ఇచ్చినా సూరి మాత్రం అఖిల్ కి సక్సెస్ ఇవ్వలేకపోయాడు.

రెండో రోజు ఒక్కరోజే రూ.20.5 కోట్లకు పైగా వసూళ్లు

Advertisement

దీంతో కథల వేటలో పడ్డ అఖిల్ మరో మూడేళ్ళు గ్యాప్ తీసుకొని లెనిన్ అనే సినిమాతో వచ్చాడు. మురళీ కృష్ణ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాని నాగార్జునే స్వయంగా నిర్మించాడు కూడా. అయితే మొదట్లో మోస్తరు బజ్ మోసిన ఈ సినిమా రిలీజ్ నాటికి మంచి అంచనాలని పెంచుకోవడం, ఇక రిలీజ్ అయ్యాక పాజిటివ్ వైబ్ తో దూసుకెళ్ళడం చూస్తుంటే అయ్యగారికి ఎట్టకేలకి సాలిడ్ హిట్ పడినట్టే కనిపిస్తుంది . మొదటి రోజు వచ్చిన రూ.16.7 కోట్ల కలెక్షన్లకి మించి రెండో రోజు ఒక్కరోజే రూ.20.5 కోట్లకు పైగా వసూళ్లు రావడం దీన్ని ప్రూవ్ చేసిందనే చెప్పాలి.అంటే రెండు రోజుల్లో దాదాపుగా 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందన్న మాట .వరుస ప్లాపుల్లో మునిగిఉన్న హీరోకి ఈ మాత్రం వసూళ్లు రావడమంటే కంటెంట్ కనెక్ట్ అయినట్టే.

అక్కినేని అభిమానుల్లో కొత్త జోష్ నింపిన చిరు ట్వీట్ 

ఇక దీనికి తోడు ఇండస్ట్రీ నుండి ప్రముఖుల విషెస్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పటికే నాని, మహేష్, సమంత వంటి వారు తమ తమ ట్వీట్స్ తో విషెస్ చెప్పేగా ఇపుడు ఏకంగా చిరు సినిమాపై ట్వీట్ వదిలి అంచనాలు పెంచేశాడు.అఖిల్ తనకు మరో కొడుకు లాంటివాడని, సినిమా సినిమాకూ అతను నటుడిగా ఎదుగుతున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తోందని చిరు చెప్పడం అక్కినేని అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అలాగే అఖిల్ నే కాకుండా కింగ్ నాగ్ మరియు ప్రత్యేకంగా అభినందనలు చెబుతూ . సినిమా చూసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒక్కసారిగా మరింత హైప్ వచ్చేసింది.

ఇలా ఇండస్ట్రీ బిగ్ బాస్ తన విషెస్ ని లెనిన్ పై కురిపించడంతో సినిమా వచ్చే రోజుల్లో మరింత దూసుకుపోతుందని, ఇదే జోష్ కంటిన్యూ అయితే వంద కోట్ల క్లబ్ లో కూర్చోవడం పెద్ద కష్టమేమి కాదని కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు మేకర్స్. చూడాలి మరి చిరు వారి ఈ ట్వీట్ కలెక్షన్ల వేటలో ఇంకెంత వేగం పెంచుతుందో !

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×