E-Paper
Advertisement

రూ.5వేలలోపే పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్.. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ !

రూ.5వేలలోపే పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్.. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ !
Advertisement

DMR portable mini washing machine: ప్రస్తుత బిజీ లైఫ్‌లో రోజూ బట్టలు ఉతకడం అంటే పెద్ద తలనొప్పి. ముఖ్యంగా బ్యాచిలర్స్, హాస్టల్ స్టూడెంట్స్, లేదా చిన్న పిల్లలు ఉన్న తల్లులకు ఇది మరీ కష్టం. పెద్ద పెద్ద వాషింగ్ మెషీన్లు కొనాలంటే.. బడ్జెట్ సరిపోదు, పైగా ప్లేస్ కూడా ఎక్కువ కావాలి. అలాంటి వారి కోసమే మార్కెట్లోకి వచ్చింది DMR (Model No: DMR 25-1208) 2.5 kg Portable Mini Washing Machine. కేవలం రూ.4,799 ధరకే లభించే ఈ చిన్న వండర్, మీ బట్టల కష్టాలను చాలా వరకు తీరుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

DMR 2.5 kg పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్ ఫీచర్లు:

1.క్యూట్ అండ్ కాంపాక్ట్ డిజైన్ :

ఈ వాషింగ్ మెషీన్ చూడటానికి చాలా చిన్నగా, క్యూట్‌గా ఉంటుంది. దీని బరువు చాలా తక్కువ కాబట్టి, ఇంట్లో ఎక్కడికైనా ఈజీగా మార్చుకోవచ్చు. మీ రూమ్‌లో ఒక చిన్న మూలలో లేదా బాత్రూమ్‌లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. మీరు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రూమ్ షిఫ్ట్ అవుతున్నా సరే, దీన్ని కార్ డిక్కీలో పెట్టుకుని ఈజీగా తీసుకెళ్లొచ్చు.

2.5 kg కెపాసిటీ & 1 kg స్పిన్ డ్రైయర్ :

Advertisement

ఇది సింగిల్ టబ్ టాప్ లోడ్ మెషీన్. అంటే ఒకే టబ్‌లో బట్టలు ఉతకాలి, అలాగే డ్రై కూడా చేసుకోవాలి. దీని వాషింగ్ కెపాసిటీ 2.5 కేజీలు. అంటే ఒకసారి 4 నుంచి 5 షర్టులు లేదా చిన్న పిల్లల బట్టలు అయితే ..ఒకేసారి 8 నుంచి 10 వరకు ఉతకొచ్చు. దీనితో పాటు 1 కేజీ కెపాసిటీ ఉన్న స్పిన్ డ్రైయర్ బాస్కెట్ కూడా వస్తుంది. బట్టలు ఉతికిన తర్వాత, ఈ బాస్కెట్ అందులో.. పెట్టి బట్టలను ఈజీగా ఆరబెట్టుకోవచ్చు .

కరెంట్, వాటర్ ఆదా :

పెద్ద వాషింగ్ మెషీన్లతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ కరెంట్, తక్కువ నీటిని తీసుకుంటుంది. దీని వల్ల మీ కరెంట్ బిల్లు కూడా పెద్దగా రాదు. అలాగే బట్టలు ఉతకడానికి ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు. కేవలం 15 నిమిషాల వాష్ టైమర్ ఆప్షన్‌తో బట్టలు త్వరగా క్లీన్ అయిపోతాయి.

Advertisement

Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో మోసపోతున్నారా? నిజమైన డిస్కౌంట్ కనిపెట్టండిలా!

ఎవరికి  బెస్ట్ ?

బ్యాచిలర్స్ & స్టూడెంట్స్: రూమ్‌లలో ఉండే వారికి.. హాస్టల్స్‌లో ఉండే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

చిన్న పిల్లలు ఉన్న తల్లులు: రోజుకు రెండు మూడు సార్లు పిల్లల బట్టలు ఉతకాల్సి వస్తుంది. వాటన్నిటినీ పెద్ద మెషీన్‌లో వేయలేం. కాబట్టి ఈ మినీ మెషీన్ చాలా యూస్‌ఫుల్.

ట్రావెలర్స్: లాంగ్ ట్రిప్స్ లేదా ఫ్యామిలీతో క్యాంపింగ్ వెళ్లేవారు దీన్ని వెంట తీసుకెళ్లొచ్చు.

ధర :

ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ DMR Mini Washing Machine కేవలం రూ.4,799 ధరకే ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంది. ఐదు వేల లోపు ఒక మంచి, వాషింగ్ మెషీన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

చేత్తో బట్టలు ఉతికి చేతులు నొప్పులు పెట్టేదానికంటే, కాస్త ఇన్వెస్ట్ చేసి ఈ DMR మినీ వాషింగ్ మెషీన్ తెచ్చుకోవడం చాలా బెటర్. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ స్పేస్‌లో ఎక్కువ లాభాన్ని ఇచ్చే ఈ హోమ్ అప్లయన్స్ ప్రస్తుత జనరేషన్‌కి ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×