Coolie Vs War 2 : ఇద్దరు స్టార్ హీరోలు నటించిన రెండు పాన్ ఇండియా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఇద్దరూ స్టార్ హీరోలు కావడంతో వీళ్లు నటించిన సినిమాలపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. వార్-2`, `కూలీ` ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఒక్కరోజు కూడా వ్యవధి లేకుండా రెండూ పోటా పోటీగా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది? అన్న దానిపై సర్వత్రా చర్చకు దారి తీసాయి. ఎవరి దమ్మెంత అన్నది తేలాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అయితే ఈ రెండు సినిమాలు అంతకు ముందే థియేటర్ల కోసం పోటీ పడుతున్నాయి… ఈ మూవీలలో ఏది బ్లాక్ బాస్టర్ అవుతుందో చూడాలి..
కూలీ vs వార్ 2 ఫైట్..
రజినీకాంత్ నటించిన కూలీ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఒకే రోజు రిలీజ్ కావడంతో స్క్రీన్ల కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి? అన్నది ఆసక్తి కరంగా మారింది. ఓపెనింగ్స్ కి కీలకంగా మారేది థియేటర్ల నెంబరే.. మొదటి రోజు ఎన్ని షోలు పడతాయి అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ డే టాక్ ను బట్టి థియేటర్ల సంఖ్య మారుతుంది. ఎందుకంటే ఫస్ట్ డే నే వచ్చిన వసూళ్లు కీలకం. అందుకే దేశీయంగా ఉన్న థియేటర్లలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో పడుతుందో ఆసక్తి కరంగా మారింది.. మరి మొత్తం ఎన్ని థియేటర్లు వచ్చాయో ఒక్కసారి తెలుసుకుందాం..
ఎవరికి ఎన్ని థియేటర్లు..?
దేశంలో మొత్తం మీద6,877 థియేటర్లు ఉండగా వాటిలో ఏపీ -తమిళనాడు టాప్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు 1,097 ఉండగా, తమిళ నాడులో 943, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703, తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి. మిగిలిన ఏరియాల్లో మంచిగానే థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలు స్టార్ హీరోల సినిమాలు. అందుకే థియేటర్ల మ్యాటర్ కీలకం. మేజర్ థియేటర్లన్నింటిని కూలీ, వార్ 2 బ్లాక్ ఆగస్టు 14 నుంచి బ్లాక్ చేసాయి.. ఇదిలా ఉండగా.. ఈ రెండు సినిమాల్లో ఏ హీరో చిత్రం అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతుంది? ఏ హీరో ఎక్కువ థియేటర్లు దక్కించుకున్నారు? అన్నది ఆసక్తిగా మారింది.. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ కు తెర పడాల్సిన సమయం వచ్చేసింది. రేపొక్క రోజే తెలిసే అవకాశం ఉంది.
Also Read :మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…
రజినీ సినిమా పై జనాల్లో ఆసక్తి నెలకొంది. తమిళ తంబీలు, ఇటు నాగార్జున విలన్ గా చేస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా కావడంతో తెలుగుతో పాటుగా యావత్ సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.. అదే విధంగా రవితేజ మాస్ జాతర కూడా 27 న రిలీజ్ కాబోతుంది. దాని టాక్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది..