OTT Movie : మలయాళం సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు ఎప్పుడొచ్చినా వదిలిపెట్టకుండా చూస్తున్నారు. అంతలా ఈ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కామెడీ జానర్ లోనే వచ్చింది. ఈ కథ మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్‌స్టార్ అయిన డేవిడ్ జీవితంలోని ఒడిదొడుకులు, అతని అహంకారం, వైఫల్యాల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ స్టోరీ చివరివరకు సరదాగా సాగిపోతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఈ కథ ఏమిటంటే
డేవిడ్ పడిక్కల్ ఒక ప్రముఖ మలయాళ సినిమా సూపర్‌స్టార్. అతని మేనేజర్ పైలీ కురువిలంగడ్, మేకప్ మ్యాన్ కమ్ డ్రైవర్ లెనిన్ ఎల్లప్పుడూ అతనితో ఉంటారు. డేవిడ్ మొదలుపెట్టిన సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో, అతను ఒక సూపర్‌స్టార్ స్థాయిని అందుకుంటాడు. అయితే అతని బాధ్యతారాహిత్యం, అహంకారం, అమ్మాయిలతో పార్టీలు, షూటింగ్‌కు సమయానికి రాకపోవడం వంటి కారణాలతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ కారణాల వల్ల, అతని చివరి మూడు సినిమాలు ఫ్లాప్ అవుతాయి, దీంతో అతని తదుపరి చిత్రం దర్శకుడు ధ్యాన్ శ్రీనివాసన్‌తో సహా సిబ్బంది అతని నటనపై నమ్మకం కోల్పోతారు. డేవిడ్ ఒక కొత్త సినిమాలో పనిచేస్తున్నప్పుడు, ప్రఖ్యాత డైరెక్టర్ కోషి దర్శకత్వంలో నటిస్తాడు. కానీ సెట్‌లో అతను సరిగ్గా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేకపోతాడు. దీంతో కోషి అతన్ని తీవ్రంగా తిడతాడు. కోపంతో డేవిడ్ సెట్ నుంచి వెళ్లిపోతూ, తన కారుతో ఒక మనిషిని గాయపరుస్తాడు. దీంతో అతని ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ సమస్య తగ్గే వరకు డేవిడ్, పైలీ, లెనిన్ దుబాయ్‌కు పారిపోతారు. అంతేకాకుండా కోషి సినిమా కూడా ఆగిపోతుంది.
దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, పైలీ సూచనతో డేవిడ్ యాక్టింగ్ కోచ్ బాలాను సంప్రదిస్తాడు. బాలా ఒక థియేటర్ నటుడు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టీచర్. అతను డేవిడ్ నటనలోని లోపాలను సరిదిద్దడానికి సహాయం చేస్తాడు. అయితే డేవిడ్ మద్యం, మాదక ద్రవ్యాల ప్రభావంలో బాలాకి సరిగ్గా సహకరించడు. తన ఇమేజ్ దెబ్బతినే భయంతో, బాలాను డ్రైవర్‌గా పరిచయం చేస్తాడు డేవిడ్. ఒక రోజు మద్యం మత్తులో డేవిడ్ బాలాను అవమానిస్తాడు. దీంతో బాలా అతనితో సంబంధం తెంచుకుంటాడు.డేవిడ్ తన మాజీ ప్రేయసి, సహనటి అన్ బావా తో మాట్లాడినప్పుడు, ఆమె అతన్ని సూపర్‌స్టార్‌గా కాకుండా నటుడిగా ఆలోచించమని, తన నటనపై దృష్టి పెట్టమని సలహా ఇస్తుంది. ఈ మాటలు డేవిడ్‌లో మార్పు తెస్తాయా ? అతను తన తప్పులను గుర్తిస్తాడా ? అతని కెరీర్ మళ్ళీ పట్టాలెక్కుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ మలయాళం సినిమాను చూసేయండి.
సైనా ప్లే లో స్ట్రీమింగ్
“నడిగర్” (Nadikar) 2024లో విడుదలైన ఒక మలయాళ కామెడీ చిత్రం. దీనికి లాల్ జూనియర్ దర్శకత్వం వహించారు. గాడ్‌స్పీడ్ సినిమా, మైత్రి మూవీ మేకర్స్ కలసి నిర్మించిన ఈ చిత్రంలో టొవినో థామస్, దివ్య పిళ్లై, సౌబిన్ షాహిర్, బాలు వర్గీస్, సురేష్ కృష్ణ, భావన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 8 నుంచి Saina Playలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.