BigTV English

Kayadu Lohar: కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.

Kayadu Lohar: కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.

Kayadu Lohar: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి(Vijay Thalapathi) తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టీవీకే పార్టీ స్థాపించిన ఆయన ఆ పార్టీని ప్రజలలో బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 27వ తేదీన పెద్ద ఎత్తున తమిళనాడు కరూర్ లో ర్యాలీ నిర్వహించారు.. ఇందులో ఆయన ప్రసంగాన్ని నేరుగా వినడానికి పెద్ద ఎత్తున టీవీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఊహకు మించిన ప్రజలు అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపు చేయడంలో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. దీంతో తొక్కిసలాట జరగగా.. చాలామంది ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. మరి కొంత మందిని దగ్గర్లోని హాస్పిటల్ కి అంబులెన్స్ ద్వారా తరలించారు.


కరూర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కయాదు ఫ్రెండ్..

ఇకపోతే ఈ కరూర్ ఘటనలో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. 90 మందికి పైగా గాయాల పాలయ్యారు. అయితే ఇలా మరణించిన వారిలో ప్రముఖ హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) ఫ్రెండ్ కూడా ఉన్నారని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ పోస్ట్ కయాదు లోహార్ పేరు మీదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఆ పోస్టు క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ పోస్టు విషయానికి వస్తే..” కరూర్ లో విజయ్ తమిళగ వెట్రి కజగం ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో నేను నా ఫ్రెండ్ ను కోల్పోయాను” అంటూ కయాదు అన్నట్టుగా.. ఆమె పేరు మీద ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అందరూ ఈమె విజయ్ ని కూడా బాధ్యుడిని చేసింది అంటూ కామెంట్లు చేశారు. పైగా 10 లక్షల వీక్షణలను దాటింది ఆన్లైన్లో బలమైన ప్రతి చర్యలకు కూడా దారితీసింది.

also read:Bigg Boss 9 Promo: ఇమ్యూనిటీ స్టార్.. కష్టపడ్డా ప్రతిఫలం దక్కలేదే?


ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన కయాదు..

దీంతో వెంటనే స్పందించింది కయాదు లోహర్.” వైరల్ పోస్టుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరుతో పోస్టులను ప్రసారం చేస్తున్న ట్విట్టర్ ఖాతా నకిలీది. దానితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ చేసిన ప్రకటనలు నావి కావు. అయితే కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటనతో నేను చాలా బాధపడ్డాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను”అంటూ తెలిపింది. ప్రస్తుతం కయాదు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయితే ఎవరో కావాలని ఈమెపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

OG Movie Tickets : టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ… పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా సామి

CV Anand Press Meet: రిలీజ్ కాకముందే ఆన్ లైన్‌లో ఎలా వస్తుందంటే? పైరసీ గ్యాంగ్‌పై CV ఆనంద్ షాకింగ్ నిజాలు

Sudigali Sudheer: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌తో వస్తున్న సుడిగాలి సుధీర్‌.. టైటిల్‌ ఇదే!

OG Piracy: ఓజీని పైరసీ చేసిన ముఠా అరెస్ట్… హార్డ్ డిస్క్‌లన్నీ స్వాధీనం

Samantha: నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం.. అంతా అయిపోయిందంటూ!

OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?

Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

Big Stories

×