E-Paper
Advertisement

MSVPG Film Trailer:  మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

MSVPG Film Trailer:  మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement

MSVPG Film Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi), నయనతార (Nayanthara)హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేయగా ఈ పాటలు సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి .ఇక త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం అధికారక ప్రకటన తెలియజేశారు.

ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

చేతిలో గన్ పట్టుకొని చిరు పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమా ట్రైలర్ జనవరి 4వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా ట్రైలర్ జనవరి 4వ తేదీ విడుదల చేయగా ఈ సినిమాని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు షైన్ స్క్రీన్, గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారు పాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

NIA అధికారిగా చిరు..

Advertisement

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవిని ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృత కనపరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారు. ఇక నయనతార విషయానికి వస్తే శశిరేఖగా నయనతార కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) కూడా క్యామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవల మాస్ సాంగ్ కూడా విడుదల చేశారు ఈ పాట ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ కైవసం చేసుకుంది.

https://twitter.com/i/status/2006999067612819884

Advertisement

వెంకటేష్ ఈ సినిమాలో దాదాపు అరగంట పాటు స్క్రీన్ పై ఉండబోతున్నారని వీరిద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలు సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తుందని డైరెక్టర్ ప్రమోషన్లలో తెలియజేస్తున్నారు.. మొత్తానికి చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సంక్రాంతి సందర్భంగా చిరంజీవి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక గత ఏడాది అనిల్ రావిపూడి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారి సినిమాపై కూడా అదే అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ రిలీజ్ పై క్లారిటీ.. ఆకట్టుకున్న న్యూ ఇయర్ పోస్టర్ !

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×