Kantara Chapter1: ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కాంతార చాప్టర్ 1(Kantara Chapter1) సినిమా పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కేవలం ఆరు రోజులకే 400 కోట్ల క్లబ్ లో చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ (Aravind Kashyap) వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈయన సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సుమారు 200 రోజులలో షూటింగ్ పూర్తి చేసామని తెలియజేశారు అయితే ఈ సినిమాలో అత్యంత కష్టపడిన సన్నివేశం గురించి కూడా ఈయన మాట్లాడారు. యువరాణిగా కనకావతి పాత్రకు సంబంధించి ఒక మూడు నిమిషాల సన్నివేశాన్ని షూటింగ్ చేయడం కోసం సుమారు నాలుగు రోజుల పాటు సమయం పట్టిందని ఈయన తెలియజేశారు. మరి అంత కష్టతరమైన సన్నివేశం ఏంటి ఎందుకు ఆ సీన్ కోసం నాలుగు రోజుల సమయం తీసుకున్నారనే విషయానికి వస్తే..
యువరాణి కనకావతి(Kanakavathi) గుర్రంపై వచ్చే సన్నివేశాన్ని తీయటానికి నాలుగు రోజుల సమయం పట్టిందని తెలిపారు. ఈ సన్నివేశం షూటింగ్ చేయడం కోసం లొకేషన్ వెళ్లాలి అంటే ప్రతిరోజు గంటన్నర పాటు ప్రయాణం చేయాలి. అరగంట పాటు నడవాలి అలాగే 45 నిమిషాల పాటు కొండలపైకి ఎక్కి వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు.ఇలా ఈ ఒక్క సీన్ చేయటం కోసం మా చిత్ర బృందం సుమారు నాలుగు రోజుల పాటు కష్టపడ్డామని అరవింద్ కస్యప్ వెల్లడించడంతో ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా మూడు నిమిషాల సీన్ కోసం ప్రతిరోజు గంటన్నర ప్రయాణం 45 నిమిషాలు పాటు ట్రెక్కింగ్ చేశారు అంటే మామూలు విషయం కాదు. సినిమాల పట్ల ఎంతో డెడికేషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని రిషబ్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కనకావతిగా మెప్పించిన రుక్మిణి…
ఇక ఈ సినిమాలో కనకావతి పాత్రలో నటి రుక్మిణి వసంత్(Rukmini Vasanth) తన అద్భుతమైన నటనను కనబరిచారు. ఇలా కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ రిషబ్ ఎంతో అద్భుతంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని ఈయన వెల్లడించారు. 2022వ సంవత్సరంలో కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న రిషబ్ ఈ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలోనే ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
Also Read: Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ రన్ టైం లాక్…ఇంతసేపంటే కష్టమే జక్కన్న!