Nayanthara: ప్రముఖ సౌత్ ఇండియన్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరో సరసన నటించిన ఈమె ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తుంది.
సినిమాల పరంగా నయనతార ఎంతలా ఫేమస్ అయ్యారో, వ్యక్తిగతంగా కూడా ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు సాధించుకున్నారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక వార్త కలకలం సృష్టిస్తుంది.
ప్రస్తుతం నయనతార ఇంటికి బాంబు బెదిరింపులు రావడం అనేది కోలీవుడ్లో హాట్ టాపిక్. గత నాలుగు రోజులుగా ప్రముఖుల ఇంటికి బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, అలానే ప్రముఖ హీరోయిన్ త్రిష కి కూడా ఈ బెదిరింపులు వచ్చాయి.
ఇక ప్రస్తుతం నయనతార కి ఇదే మాదిరిగా బెదిరింపులు వచ్చాయి. అల్వాస్ పేటలో వీనస్ కాలనీ అనే ఒక ప్రాంతంలో వీళ్ళ కొత్త ఇల్లు ఉంటుంది. అయితే ఈ ఇంటికి బాంబు బెదిరింపులు రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. మొత్తానికి ఎక్కడ ఏమీ లేదు అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ ఫోన్ కాల్స్ అన్ని ఎవరు చేస్తున్నారు అని కనిపెట్టే పనిలో పడిపోయారు.
అయితే నయనతార ఇంట్లో విగ్నేష్ శివ నయనతార ఇద్దరు కూడా లేరు. నేను రౌడీనే అనే సినిమాతో దర్శకుడుగా మారాడు విగ్నేష్ శివన్. ఆ సినిమాతోనే నయనతార కి విగ్నేష్ కి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారి ఇద్దరు ఒకటయ్యారు. విగ్నేష్ కంటే ముందు ప్రభుదేవా, శింబు వంటి నటులతో కూడా నయనతార రిలేషన్ లో ఉన్నట్టు అప్పట్లో కథనాలు వినిపించేవి.
Also Read: Neeraja Kona: హీరోయిన్స్ కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వెనక అసలు కథేంటో తెలుసా… అన్నీ ఫ్రీగానే ?