Rishabh shetty: కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) తాజాగా కరూర్ తొక్కిసలాట(Karur Stampede) ఘటన గురించి స్పందించారు. సినీ నటుడు విజయ్(Vijay) దళపతి టీవీకే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే ఈ రాజకీయ వ్యవహారాలలో భాగంగా ఈయన కరూర్ లో నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. సరైన స్థలం లేని నేపథ్యంలో హీరో విజయ్ ని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భాగంగా సుమారు 41 మందికి పైగా ప్రాణాలను కోల్పోగా, 60 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఈ విషయం కాస్త ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు తమిళ రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.
ఇక ఈ ఘటనపై ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే తాజాగా నటుడు రిషబ్ శెట్టి సైతం కరూర్ తొక్కిసలాట ఘటన గురించి స్పందించారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరం అని తెలిపారు. అయితే ఒకరి వల్ల ఇలాంటి తప్పు జరగదు. ఈ తప్పు సమిష్టి వైఫల్యం కావచ్చు అని ఈయన తన అభిప్రాయాన్ని తెలిపారు. అందరూ ఒక్కసారిగా తరలి రావడంతో వారిని నియంత్రించే విషయంలో లోపాలు కూడా జరిగి ఉండవచ్చని ఈయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఇలాంటి ర్యాలీలకు వెళ్లినప్పుడు మనమే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని అలాగే పోలీసులను నిందించడం చాలా సులభం. ఇలా జన సమూహం ఏర్పడినప్పుడు వారిని నియంత్రించడం పోలీసులకు కూడా ఎంతో కష్టతరమైన విషయమని ఈ సందర్భంగా కరూర్ తొక్కిసలాట ఘటన గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక కాంతార 1 సినిమా తమిళ భాషలో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం చెన్నైలో కూడా ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఓవర్సీస్ లో దుమ్ము లేపుతున్న కాంతార1…
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముందు రోజే ఇలాంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో చిత్రబృదం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిషబ్ ఈ ఘటనపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంతార చాప్టర్ 1 సినిమా విషయానికి వస్తే.. అక్టోబర్ రెండవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని కేవలం ఆరు రోజులలోనే 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టటం విశేషం. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తోంది.
Also Read: Keerthy Suresh: హీరోయిన్ గా మాత్రమే కాదు.. అలాంటి పాత్రలకు సై అంటున్న కీర్తి సురేష్!