BigTV English

Manchu Vishnu: MBU సీజ్.. సుదీర్ఘ ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు!

Manchu Vishnu: MBU సీజ్.. సుదీర్ఘ ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు!

Manchu Vishnu: మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) లో అక్రమంగా విద్యార్థుల నుంచి 26 కోట్ల రూపాయలు ఫీజుల పేరిట వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యా కమిషన్ 15 లక్షల జరిమానా తో పాటు 15 రోజుల్లోగా 26 కోట్లు చెల్లించాలి అని షరతులు విధించింది. అంతేకాదు మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేస్తూ సీజ్ చేయాలి అని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సులు జారీ చేసింది. దీంతో స్పందించిన మంచు కుటుంబం ఉన్నత విద్యా కమిషన్ తమ పరువు తీసింది అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.


సుదీర్ఘ ప్రకటన పంచుకున్న మంచు విష్ణు..

అందులో భాగంగానే తాజాగా మంచు మోహన్ బాబు వారసుడు, సినీ నటుడు, యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు తాజాగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. మరి మంచు విష్ణు విడుదల చేసిన ఆ ప్రకటనలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

ప్రకటనలో ఏముందంటే?

“మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలను ఉద్దేశించి..ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తోంది. ఇవి కేవలం సిఫార్సులు మాత్రమే. ఆ సిఫార్సులు ప్రస్తుతం గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు.. APHERMC సదరు సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా స్టే ఉత్తర్వును హైకోర్టు వారు జారీ చేసి ఉండగా.. APHERMC వారు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి పోర్టల్ లో పెట్టడం దురదృష్టకరం.


APHERMC చేసిన సిఫార్సులు సరికాదని మోహన్ బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది. ఈ విషయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు మాకు న్యాయం చేకూరుస్తుందని నమ్ముతున్నాము. ఈ విషయాన్ని తీవ్రతరం చేసి యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగానే ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని అటు తల్లిదండ్రులకు, ఇటు మీడియాకి, యూనివర్సిటీ భాగస్వాములు అందరికీ తెలియజేస్తున్నాను.

మోహన్ బాబు యూనివర్సిటీ నేడు భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మారుస్తోంది. ఎంబీయూ ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్లు, అధిక వేతన ప్యాకేజీలను స్థిరంగా సాధిస్తుంది. అంతేకాదు దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కూడా సాధ్యపడని రికార్డులను సృష్టిస్తోంది. 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించబడింది. అప్పటినుంచి ఈ విశ్వవిద్యాలయం బలమైన సామాజిక నిబద్ధతను కొనసాగిస్తోంది.

ఎంతోమందికి ఉచిత విద్యను అందించడం , సాయుధ దళాలు, పోలీస్ సిబ్బంది పిల్లలకు కూడా పూర్తి స్కాలర్షిప్లు ఇవ్వడం, అనాధలను దత్తత తీసుకొని వారికి పూర్తి విద్య, సంరక్షణ అందించడం వంటివి చేస్తోంది. విద్యా సమాజ సేవలో మా సహాయ సహకారాలు బహిరంగ రికార్డుల్లో ఉన్నప్పటికీ దురుద్దేశంతోనే కొంతమంది పదేపదే ఇలాంటి మా ప్రయత్నాలను విమర్శిస్తున్నారు.

మా అకాడమిక్ శ్రేష్టత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తోంది.QS 100 ర్యాంకు పొందిన పెన్ స్టేట్ యూనివర్సిటీ (USA)తో జాయింట్ డిగ్రీ ప్రోగ్రాం ప్రవేశపెట్టిన ఇండియా మొదటి యూనివర్సిటీ ఇదే. మాకు RWTH ఆకేన్ విశ్వవిద్యాలయం (జర్మనీ), విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం (USA) తో కూడా అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు భారతదేశంలో తమ డిగ్రీలను కొనసాగిస్తూనే.. విదేశీ యూనివర్సిటీలలో సెమిస్టర్, పరిశోధనా కార్యక్రమాలను అభ్యసించడానికి కూడా వీలు కలుగుతుంది.

కొద్దిమంది సభ్యులతో ఏర్పడిన కమిటీ.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక విశ్వవిద్యాలయాల అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిన సమయంలో స్వల్ప పరిపాలన అంశాలను పెంచి చూసి అనవసర వివాదాన్ని సృష్టించడం దురదృష్టకరం. విచారణ సమయంలో ఎంబీయూ బృందం మాకు పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం ఎలాంటి తప్పు జరగలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా గౌరవనీయ ఛాన్స్లర్ డాక్టర్ ఎం మోహన్ బాబు గారి మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తివంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం” అంటూ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు మంచు విష్ణు.

ALSO READ:Bigg Boss 9 Promo: ఎక్స్ప్లోజివ్ టాస్క్.. అదరగొట్టేసిన ఇమ్మానియేల్ !

Related News

‎SSMB 29: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. ఇలాంటి టైటిల్ ఏంటీ జక్కన్న!

Mithra Mandali : తెలివితేటలు ప్రదర్శించొద్దు, మిత్రమండలి సినిమా పైన ఓపెన్ అయిన బన్నీ వాస్

Shahrukh Khan: షారుఖ్ ఖాన్ కు షాక్.. సమన్లు జారీ చేసిన హైకోర్టు!

Venkatesh X Trivikram : సెట్స్‌లో త్రివిక్రమ్, వెంకటేష్, మొత్తానికి అజ్ఞాతవాసం వీడిని గురూజీ

SSMB29: ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ లాంచ్‌కి రంగం సిద్దం.. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌ ఈవెంట్‌ ప్లాన్‌!

Nayanthara: నయనతార ఇంటికి బాంబు బెదిరింపులు, కోలీవుడ్ లో కలకలం

Rishabh shetty : కరూర్ తొక్కిసలాటపై రిషబ్ శెట్టి రియాక్షన్.. తప్పు కాదు అంటూ..

Neeraja Kona: హీరోయిన్స్ కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వెనక అసలు కథేంటో తెలుసా… అన్నీ ఫ్రీగానే ?

Big Stories

×