Walking Faster or Longer: బరువు తగ్గడానికి వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. కానీ సాధారణంగా చాలా మందికి వచ్చే ప్రశ్న ఏమిటంటే.. బరువు తగ్గడానికి వేగంగా నడవాలా లేక ఎక్కువ దూరం నడవాలా ? అని.. నిపుణులతో పాటు చాలా అధ్యయనాలే ఈ రెండిటిపై భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నప్పటికీ సరైన సమాధానం మీ లక్ష్యాలతో పాటు ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ బరువు తగ్గడానికి వేగంగా నడవాలా లేదా ఎక్కువ దూరం నడవాలా అనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేగంగా లేదా దూరంగా.. ఎలా నడిస్తే మంచిది ?
వేగంగా నడవడం:
వేగంగా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇలా నడవడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. అంతే కాకుండా మీ గుండె వేగం కూడా చాలా వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల:
వేగంగా నడవడం అనేది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం వల్ల నెమ్మదిగా నడిస్తే ఎంత బరువు తగ్గుతామో అంతకంటే ఎక్కువ ఫలితాలు పొందుతాము.
గుండె ఆరోగ్యం:
ఇది మీ గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఒక గంటలో దాదాపు 300 కేలరీలు నెమ్మదిగా నడిస్తే అదే సమయంలో వేగంగా నడవడం వల్ల మాత్రం 400 కేలరీల వరకు బర్న్ చేయవచ్చు.
ఎక్కువ దూరం వాకింగ్:
ఎక్కువ దూరం వేగంగా నడవడం వలకల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం వాకింగ్ చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మొత్తం కేలరీల ఖర్చు:
ఎక్కువ దూరం నడవడం ద్వారా లేదా ఎక్కువ సమయం నడవడం ద్వారా వేగం తక్కువగా ఉన్నా కూడా కేలరీల ఖర్చు ఎక్కువగా అవుతుంది. కొంతమంది నిపుణుల ప్రకారం.. ఖర్చు చేసిన కేలరీలను ఖచ్చింగా అంచనా వేయడానికి సమయం కంటే దూరం మంచి కొలమానం.
గాయం అయ్యే ప్రమాదం:
ఎక్కువ దూరం నడవడం అనేది తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం. కొత్తగా ప్రారంభించే వారికి లేదా కీళ్ల సమస్యలు ఉన్న వారికి గాయాలు అయ్యే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఫ్యాట్ లాస్:
కొన్ని అధ్యయనాలు నెమ్మదిగా.. లేదా ఎక్కువ సమయం నడిచే వారికి మొత్తం శరీరంలోని కొవ్వు తగ్గుదల చాలా వేగంగా జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువ బరువు ఉన్న వారిలో ఈ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read: ఖాళీ కడుపుతో గ్రీన్ ఆపిల్ తింటే.. మతిపోయే లాభాలు !
వేటితో ఎక్కువ లాభాలు:
నిజం చెప్పాలంటే.. రెండూ చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునే వారితో పాటు ఫిట్ గా ఉండాలని అనుకునే వారు వేగం, దూరం రెండింటినీ కలపడం మంచిది.
మంచి ఫలితాలు:
ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 10 వేల అడుగులు నడవడం, అందులో 3,500 అడుగులు ఎక్కువ వేగంగా నడవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.
ఇంటర్వెల్ వాకింగ్:
వేగంగా లేదా నెమ్మదిగా నడవడాన్ని మధ్య మధ్యలో మారుస్తూ ఉండటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని ఇంటర్వెల్ వాకింగ్ అని పిలుస్తారు. కేలరీలు ఎక్కువగా బర్న్ చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.