Vijay Approched Suprem Court: కరూర్ జిల్లా తొక్కిసలాట కేసులో మద్రాసు కోర్టును సవాళు చేస్తూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సిట్ వైఖరిపై అభ్యంతరం తెలుపుతూ అత్యున్నత న్యాయస్థానంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరూర్ జిల్లా తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తుంది. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో విజయ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై విచారించిన మద్రాసు హైకోర్టు టీవీకే పార్టీ తీరు, ర్యాలీ తర్వాత నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అయితే ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీవీకే చీఫ్ విజయ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తునకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా సిట్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ ఏర్పాటైన విషయం విధితమే.
దీనిపైసుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే పార్టీ.. పోలీస్ అధికారుల దర్యాప్తు, అధికారుల పాత్రపైనా తాము ఇదివరకే ప్రశ్నలు లేవనెత్తినట్లు గుర్తు చేశారు. తమిళనాడు రాష్ట్ర పోలీస్ అధికారులతోనే మద్రాస్ హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిందని, ఈ క్రమంలోనే తమ పార్టీపై సిట్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీవీకే పార్టీ ఆరోపించింది. ఇటీవల ఈ కేసుపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు..టీవీకే పార్టీ, ఆ పార్టీ చీఫ్ విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయ్‌కి లీడర్ లక్షణాలు లేవని, తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే నేతలు అంత అక్కడి నుంచి పారిపోయారంటూ కోర్టు మండిపడింది.
Also Read: Mohan Babu University: 26 కోట్లు కాదు 200 కోట్లు.. మోహన్ బాబు యూనివర్సిటీ చీకటి బాగోతం ఇదీ..!
ఇక విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు.. టీవీకే పార్టీపై, ఆ పార్టీ చీఫ్ విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయ్‌కి లీడర్ లక్షణాలు లేవని.. తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే నేతలు అంతా అక్కడి నుంచి పారిపోయారని అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే పార్టీ తీరును కూడా మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపడితే.. టీవీకే పార్టీ నిర్వాహకులు మాత్రం వెళ్లిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించిన.. అయితే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసినట్లు తెలిపింది.
ఇక తన ర్యాలీని ఫెయిల్ చేసేందుకు ముందస్తు కుట్రలు జరిగినట్లు టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. గత నెల 27వ తేదీన కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు డీజీపీకి విజయ్ ఈ-మెయిల్ పంపించారు. తమ వారిని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలను తాను స్వయంగా కలిసి పరామర్శించాలని కోరుకుంటున్నానని, ఇందుకు తనకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.