Neeraja Kona: చాలామంది ప్రేక్షకులు తమ హీరోలను హీరోయిన్స్ ను విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్లను అనుకరించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ముఖ్యంగా సినిమాలపరంగా అనుకరించడం మాత్రమే కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కూడా దగ్గరగా పరిశీలిస్తారు.
అలానే కొన్ని సినిమాల్లో హీరోలు ధరించే దుస్తులు మీద కూడా ఆడియన్స్ కి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. వాటిని కూడా కొనుక్కొని నిజజీవితంలో తొడుక్కునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఒక సినిమాలో ఖరీదైన టీషర్ట్ చూసి అది కొనుక్కొని, వేసుకొని పదిమంది ఫ్రెండ్స్ దగ్గర ఆ సినిమాలో ఫలానా హీరో ఇదే వేస్తాడు అని చెప్పుకోవడం అనేది ఒక రకమైన సంతృప్తి.
అయితే చాలామందికి ఒక విషయంలో అవగాహన ఉంటుంది. కొందరు హీరోలు కొన్ని రకాల బట్టలు వేసుకున్నప్పుడు అవి కేవలం షూటింగ్ వరకు మాత్రమే వేసుకుంటారు అని అవగాహన ఉంటుంది. మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సెట్స్ కి వచ్చినప్పుడు చాలా సింపుల్ గా వస్తారు. అప్పుడు కాస్ట్యూమర్ ఇచ్చిన బట్టలను వేసుకొని షూటింగ్లో పాల్గొంటారు.
బయట ఎక్కువగా అటువంటి బట్టలు ధరించరు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడానికి మెయిన్ కారణం. అప్పట్లో గుడుంబా శంకర్ సినిమాలోని పాంట్ అంతలా పాపులర్ అయింది. మహేష్ బాబు లాస్ట్ ఫిలిం గుంటూరు కారం సినిమాలో కూడా చెక్ షర్ట్స్ బాగా పాపులర్ అయ్యాయి.
ఇక హీరోల విషయం పక్కన పెడితే చాలా ఫంక్షన్స్ కి హీరోయిన్లు చాలా అందంగా రెడీ చేస్తుంటారు. వాళ్లు ఒకసారి వేసుకునే బట్టలు మళ్లీ ఇంకో ఫంక్షన్ లో కానీ ఎక్కడా కాని కనిపియ్యవు. వాళ్లు ధరించే దుస్తులు కూడా లక్షల్లో ధరలు ఉంటాయి. ఈ హీరోయిన్ వేసుకునే డ్రెస్ ధర తెలుసా అనే కథనాలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. చాలామంది వాటిని వెతుక్కుని అవి కొనుక్కునే ప్రయత్నాలు చేస్తారు.
అయితే మనకు చాలా ఈవెంట్స్ లో హీరోయిన్స్ ధరించే దుస్తులకు అసలు వెలపెట్టారట. వాళ్లకి ఉన్న స్టైలిష్ ఆ డ్రెస్ ను ఫ్రీగా వాళ్లకు ఇస్తారు. వాళ్లు ఆ డ్రెస్ తీసుకొని కొన్ని ఫొటోస్ దిగి, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో అప్లోడ్ చేస్తారు.
అలా అప్లోడ్ చేసిన వెంటనే చాలామంది దృష్టిని అవి ఆకర్షిస్తాయి కాబట్టి. వాటిని కొనుక్కోవడానికి సామాన్య ప్రేక్షకులు ఆలోచనలో పడతారు. ఆ ఆలోచన ఉన్నవారికోసం ప్రత్యేకంగా అదే విధంగా కనిపించేలా ఉండే డ్రెస్సులను తయారు చేస్తారు. ఈ విషయాన్ని ప్రముఖ స్టైలిష్, దర్శకురాలు నీరజ కోన తెలుసు కదా సినిమా ఇంటర్వ్యూ లో రివిల్ చేశారు.
Also Read: Kiran Abbavaram : సినీ ఇండస్ట్రీలో పర్షియాలిటీస్… సాక్ష్యాలతో బయట పెట్టిన కిరణ్ అబ్బవరం