Mohan Babu University Controversy: మొన్నటివరకు ఫ్యామిలీ గొడవలతో వార్తల్లో నిలిచిన సినీ నటుడు, విద్యావేత్త మంచు మోహన్ బాబు ఇప్పుడు మరో వివాదంలో నిలిచాయి. మోహన్ బాబు యూనిర్సిటీలో(Mohan Babu University) విద్యార్థు ఫిజులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫిజు రియింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుంచి కూడా అదనంగా ఫిజులు వసూళ్లు చేశారని, దాదాపు రూ. 26 కోట్ల వరకు అదనంగా ఫిజులు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల ఫౌండేషన్ ఉన్నత విద్యా కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం బట్టబయలైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉన్నత విద్యా కమిషన్ యూనివర్సిటీపై దాడి చేసి ఇవి నిజమని తేల్చింది.
దీంతో మోహన్ బాబు యూనివర్సిటీపై రూ. 15 లక్షలు జరిమాన విధించారు. అంతేకాదు అదనంగా వసూళ్లు చేసిన రూ. 26 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ వ్యవహరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం మారింది. ఈ వ్యవహరంపై కొన్నేళ్లుగా పోరాడుతున్న విద్యార్థి సంఘాలు నాయకులు స్పందించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఇప్పుడే కాదు ఎంతోకాలంగా మోసాలు జరుగుతున్నాయి. వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. విద్యార్థుల నుంచి వివిధ రకరకాలుగా ఫిజులు వసూళ్లు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఫిజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. నిజం చెప్పాలంటే రూ. 26 కోట్లు అనేది చిన్న విషయం. మోహన్ బాబు యూనివర్సిటీలో రూ. 200 కోట్లపైగా అవినీతి జరిగింది. మూడు సంవత్సరాల క్రితం యూనివర్సిటీలో ఫిజుల పేరుతో, మోహన్ మంత్రాలు, క్యాంటీల్ల పేరుతో విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూళ్లు చేశారు.
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిజుల పేరుతో తమని దోచేస్తున్నారని, జలగళ్ల మా రక్తం తాగుతున్నారంటూ ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు మా వద్దకు వచ్చి మొర పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని మేము కాలేజికి వెళ్లి అడిగితే మమ్మల్ని బౌన్సర్లతో కొట్టించారు. దీంతో మేము యూనివర్సిటీ ముందు శాంతియుతంగా ధర్నాకు దిగాం. ఈ వ్యవహరంలో మోహన్ బాబు చిన్న కుమారుడు మాకు సపోర్టు నిలిచారు. ఆఖరిపై ఆయనపై కూడా దాడులు, కేసులు పెట్టారు. ఈ విషయంలో ఎవరూ అడిగిన వారిపై దాడులు చేస్తున్నారు. ప్రశ్నించిన మీడియా మిత్రులపై కూడా దాడులు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి అవినీతిగా దోచిన రూ. 200 కోట్లు తిరిగి చెల్లించాల్సిందే. అదే విధంగా మోహన్ బాబు యూనివర్సిటీని తక్షణమే సీజ్ చేయండి.. యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలంటే.. ఎస్యూ యూనివర్సిటీలో మోహన్ బాబు యూనివర్సిటీని విలీనం చేసి విద్యార్థులకు న్యాయం చేయండి అని విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు.
Also Read: Rajvir Jawanda: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
మంచు ఫ్యామిలీలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. మంచు ఫ్యామిలీ అంత చిత్తూరు ఊరి పేరు పరువు తీస్తున్నారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమలో, ఇటూ తిరుపతి విద్యాసంస్థల పేరుతో పరువు తీస్తున్నారు. యూనిర్సిటీ పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిలువు దోపిడి చేస్తున్నారు. ఈ యూనివర్సిటీ డేస్ కాలర్స్ విద్యార్థుల నుంచి కూడా అన్ని రకాలుగా దోపిడి చేస్తున్నారు. డేస్ కాలర్స్ ఆర్టీసు బస్సులో కాలేజీకి వెళ్లకూడదు. ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తినడానికి వీలు లేదు. సొంతంగా యూనిఫాం కుట్టించుకోకూడదు. ఎవరైనా సరే.. యూనివర్సిటీ తిన్న తినకున్నా.. యూనిఫాం కుట్టించుకున్న కుట్టించుకోకున్నా.. ప్రతి సంవత్సం విద్యార్థులు రూ. 50 వేలు చెల్లించాల్సిందే అని నిబంధనలు పెడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. బౌన్సర్లతో కొట్టిస్తున్నారు” అంటూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లు యూనివర్సిటీ పేరుతో విద్యార్థులన నిలువు దోపిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిజుల పేరుతో మోహన్ బాబు యూనిర్సిటీలో జరుగుతున్న కుంభకోణం రుజువవ్వడంతో ఏపీ ఉన్నత విద్యాశాఖ యూనివర్సిటీకి రూ. 15 లక్షల జరిమాన విధించింది. అదేవిధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూళ్లు చేసిన రూ. 26 పైగా కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా చెల్లించాలని విద్యాశాఖ ఆదేశిస్తూ.. యూనివర్సిటీ గుర్తింపు, అనుమతిని రద్దు చేయాలని విద్యాకమిషన్ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉండగా.. దీనిపై స్టే విధించారు. ప్రస్తుతం ఈ కేసుపై హైకోర్టు త్రిసభ్య కమిటిని నిమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ కేసును అక్టోబర్ 14కు వాయిదా వేసింది న్యాయస్థానం.