దేశంలో విమానయాన రంగం ఆధునిక హంగులను అందుకుంటుంది. దేశంలోనే కంప్లీట్ డిజిటల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించబడిన ఈ ఎయిర్ పోర్టు ముంబైలో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత బూస్టింగ్ ఇవ్వడంతో పాటు 2 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పించబోతోంది.
పూర్తి డిజిటల్ విధానంలో సేవలను అందించే ఈ ఎయిర్ పోర్టు ప్రపంచ స్థాయి నగరాల్లోని ఎయిర్ పోర్టులతో పోటీ పడనుంది. లండన్, న్యూయార్క్, టోక్యోతో సహా పలు విమానాశ్రయాలను కలిగి ఉన్న నగరాల జాబితాలో ముంబై చేరింది. నవీ ముంబై విమానాశ్రయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, సింగపూర్ చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం లాగా సేవలు అందించబోతోంది. ఈ అత్యాధునిక విమానాశ్రయం మరో రెండు నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కొనసాగించనుంది.
1.దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ విమానాశ్రయం అయిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2.రూ.19,650 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయం నిర్మించబడింది. ఇది రియల్ ఎస్టేట్, పర్యాటకం, వాణిజ్య రంగాలకు బూస్టింగ్ ఇవ్వనుంది. విమానయానం, లాజిస్టిక్స్, ఐటీ, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ లాంటి రంగాలలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
3.ఈ విమానాశ్రయం పూర్తిగా ఆటోమేటెడ్, AI- ఆధారిత టెర్మినల్ కార్యకలాపాలకు సపోర్టు చేస్తుంది. వాహన పార్కింగ్ స్లాట్లను ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యాలు, ఆన్ లైన్ లగేజీ డ్రాప్, ఇమ్మిగ్రేషన్ సేవలు ఉన్నాయి.
4.కమలం మోడల్ తో కూడిన నిర్మాణం ఆకట్టుకుంటుంది. ఆధునిక, సంప్రదాయ విధానాల మేళవింపుగా నిర్మించారు. సహజ లైటింగ్ ఆకట్టుకునేలా ఉంటుంది.
5.ఒక టెర్మినల్, రన్‌వే ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, 1,160 హెక్టార్ల విమానాశ్రయం ఏటా దాదాపు 20 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పూర్తిగా తుది నాలుగు టెర్మినల్స్, రెండు రన్ వేలతో, విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో 155 మిలియన్ల మంది ప్రయాణీకులకు చేరనుంది.
6.ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, అకాసా ఎయిర్ సహా అనేక ఇతర విమానయాన సంస్థలు దేశ వ్యాప్తంగా నగరాలను కలుపుతూ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి.
7.దాదాపు 40 శాతం అంతర్జాతీయ ట్రాఫిక్ తో వాణిజ్య కార్యకలాపాలు డిసెంబర్ లో ప్రారంభమవుతాయి. ఈ విమానాశ్రయం ప్రారంభంలో ప్రతిరోజూ 12 గంటలు పనిచేస్తుందని, అంతర్జాతీయ ట్రాఫిక్ నెమ్మదిగా 75 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు.
8.అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అరుణ్ బన్సాల్ ఈ విమానాశ్రయం ఇండియాలోనే అత్యధునిక, డిజటల్ విమానాశ్రయంగా గుర్తింపు పొందబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి విషయాన్ని AI- ఆధారిత ట్రాకింగ్ విధానం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. బ్యాగ్ కారౌసెల్‌లో 20వ నంబర్‌లో ఉందని.”
9.ఇది ఎక్స్ ప్రెస్ వేలు, మెట్రో, సబర్బన్ రైలు నెట్ వర్క్, సీ ట్రాన్స్ పోర్టు సేవలను అనుసంధానిస్తుంది.
10.నవీ ముంబై విమానాశ్రయాన్ని CIDCO (సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్), అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ కలిపి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించారు.
The wait is finally over!
After decades of wait, a new era of connectivity is set to begin with the inauguration of The Navi Mumbai International Airport, tomorrow at the hands of Hon PM Narendra Modi Ji.Built at a cost of ₹19,650 crore, it has an annual passenger handling… pic.twitter.com/Z5bqrNwonc
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 7, 2025
Read Also: నదీ గర్భంలో 33 మీటర్ల లోతులో.. చిరుతలా దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?