Kiran Abbavaram : ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ప్రేక్షక దేవుళ్ళు అని పిలిచేవారు. రాంగోపాల్ వర్మ శివ సినిమా హిట్ అయిన తర్వాత కూడా రాంగోపాల్ వర్మను అక్కినేని నాగేశ్వరరావు పిలిచి, సినిమాను ఇంత హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్యూ చెబుతూ స్టేట్మెంట్ ఇవ్వమని ఆర్జీవి ని అడిగారు. ఆర్జీవి గురించి మనకు తెలిసిందే కదా, ఇంత మంచి సినిమా తీసినందుకు వాళ్లే నాకు థాంక్యూ చెప్పాలి కదా అన్నట్లు అప్పుడు ఆయనకు సమాధానం చెప్పారు.
నీ ఉదాహరణ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోలు అంతా కూడా ప్రేక్షకులకు దేవుడు స్థానాన్ని ఇచ్చారు. ఇక రీసెంట్ కాలంలో ప్రేక్షకులు కూడా తమకు తాముగా మరిచిపోయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. అలా చెప్పుకున్న మాదిరిగానే కొన్ని సినిమాలు విషయంలో బానిసలుగానే ప్రవర్తిస్తారు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే అలా ఉంటారు. మిగతావారు ప్రవర్తించే తీరు వేరు. మన సినిమాలకు ఆదరణ కాదు కదా కనీసం ఇతర రాష్ట్రాల్లో థియేటర్స్ కూడా లభించవు. ఇదే విషయాన్ని కిరణ్ అబ్బవరం ప్రస్తావించాడు.
కిరణ్ ప్రస్తుతం K-Ramp సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉంటుంది అని పలు రకాల ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాడు. దీనికి సంబంధించిన టీజర్ కూడా అదే మాదిరిగా ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో, పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు.
ఒక ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ హీరో ప్రదీప్ రంగనాథన్ ఉన్నాడు. తన సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. అలానే ఎక్కువ థియేటర్లు కూడా లభిస్తాయి. కానీ నా సినిమాల విషయానికి వస్తే చెన్నైలో కనీసం థియేటర్స్ కూడా దొరకవు. నేను చేసిన క సినిమాకు థియేటర్స్ ఇవ్వలేము అని మొహం మీదే చెప్పేశారు అంటూ వాపోయాడు కిరణ్.
కిరణ్ నటించిన క సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ కాన్సెప్ట్ బేస్ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.
కిరణ్ కు వరుస డిజాస్టర్ సినిమాలు పడుతున్న తరుణంలో ఈ సినిమా మంచి ఉపశమనాన్ని కలిగించింది. అంతేకాకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయితే ఇండస్ట్రీ విడిచి వెళ్లిపోతాను అని కిరణ్ స్టేట్మెంట్ కూడా అప్పట్లో వైరల్ గా మారింది. మొత్తానికి ఈ సినిమా సక్సెస్ తో కిరణ్ కం బ్యాక్ అయిపోయాడు.
Also Read: SSMB29 : రాజమౌళి మాస్టర్ ప్లాన్, మహేష్ బాబు తో ఆ పని చేస్తున్న జక్కన్న