Srikanth iyengar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరు. ఎక్కువగా రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల సినిమాలలో నటించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగర్ కు విపరీతమైన నాలెడ్జ్ ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు.
కానీ ఆ నాలెడ్జ్ అనేది ఉపయోగించాల్సిన చోట ఉపయోగించాలి. కొన్ని విషయాల్లో మాట్లాడకుండా ఉండటం చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో శ్రీకాంత్ అయ్యంగర్ తనకు అనిపించింది అనిపించినట్లు మాట్లాడుతూ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో కూడా పొట్టేలు సినిమా అప్పుడు రివ్యూ రాసే వాళ్ళు పేడ పురుగులు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా జర్నలిస్ట్ సంఘాలు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక గాంధీ జయంతి సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. తరుణంలో చాలామంది ఆయన పైన కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టారు. మా అసోసియేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అతనిపై కంప్లైంట్ చేశారు.
నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశాం. శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. మహాత్మా గాంధీ గురించి సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెడుతున్నాడు. ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం.
మా అసోసియేషన్ శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు.సినిమా పెద్దలను కోరుతున్నాను.. మీరు దీనిపై స్పందించాలి. పెద్ద హీరోలు శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై స్పందించాలి. ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేము యాంటీ బయోటిక్ కావల్సి వస్తుంది.
మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ కామెంట్స్. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఈరోజుల్లో ఫ్యాషన్ అయ్యింది. మాకు డిస్ప్లినరీ కమిటీ ఉంది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా కమిటీ మీటింగ్ పెట్టి. త్వరలోనే చర్యలు తీసుకుంటాం.
వివాదం రోజు రోజుకి ముదురుతుంది కాబట్టి శ్రీకాంత్ అయ్యంగర్ దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన నటిస్తున్న సినిమాలకు కూడా ఆ స్టేట్మెంట్ వలన ఇబ్బంది కలుగుతుంది. తను నటించిన ఆరి అనే ఒక సినిమాను కూడా బ్యాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శ్రీకాంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: Andhra King Taluka Teaser: అందరు ఫ్యాన్స్ కి టచ్ అయ్యే డైలాగ్ , ఇకనైనా మారుతారా?