Tollywood:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకుంది సింగర్ సునీత. హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు వచ్చినా.. వాటన్నింటినీ కాలదన్ని సింగర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా కొన్ని వందల పాటలు పాడి అందరిని అలరించిన ఈమె.. ఈమధ్య అటు పలు స్టోర్ ఓపెనింగ్ లకి కూడా వెళ్తూ సందడి చేస్తోంది l. అందులో భాగంగానే తాజాగా జూబ్లీహిల్స్ లో సందడి చేసిన ఈమె.. తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 66 లో “అతిన రీగల్ వీవ్స్” పేరిట ఒక కొత్త షో రూమ్ ను సింగర్ సునీత చేతులమీదుగా ప్రారంభించారు. ఈ స్టోర్ ను ప్రారంభించిన సునీత అనంతరం మాట్లాడుతూ.. “ఈ రోజున నేను అతిన స్టోర్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్టోర్ కి సిల్క్ మార్క్ సర్టిఫికెట్ రావడం నిజంగా గొప్ప విషయం. ఇక్కడ ఇంత మంచి కలెక్షన్స్ చూస్తుంటే ప్రతి శారీను కూడా కొనాలని అనిపిస్తుంది. చాలా క్వాలిటీతో ఉన్నాయి. యూనిక్ కలెక్షన్స్.. బనారసీ, బాందిని కలిపి చేయడం చాలా కొత్తగా ఉంది. థ్రెడ్ వర్క్ తో చేయడం ఇంకా బాగుంది. కాంబినేషన్ శారీస్ ఇక్కడ లభించడం మరింత గొప్ప విషయం అంటూ తెలిపింది. ఇకపోతే ఇక్కడ ఈ స్టోర్ ఓపెనింగ్ లో భాగంగా కొన్ని రకాల చీరలను పరిశీలించిన సునీత.. వాటిని తన భుజాలపై వేసుకొని మురిసిపోయింది. తన అందంతో చీరలకే సరికొత్త హుందాతనాన్ని తీసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ట్విస్ట్ ఏంటంటే?
ఇక అతిన రీగల్ వీవ్స్ నిర్వాహకులు.. అనిత, లహరిక, మనస్విని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..” రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్యూర్ పట్టు చీరలు అందించాలనే లక్ష్యంతోనే ఈ స్టోర్ ప్రారంభించాం. ప్రతి ఇంట్లో మా చీరలు ఉండాలనే ఆశతో అన్ని రకాల కలెక్షన్స్ ఎప్పటికప్పుడు కొత్తగా డిజైన్ చేయించడం మా స్టోర్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ బ్రైడల్ కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక యూనిక్ స్టోర్ ని ఏర్పాటు చేశాము. స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను కూడా అందిస్తున్నాము. కస్టమర్ లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము” అంటూ నిర్వాహకులు సూచించారు. ప్రస్తుతం ఈ స్టోర్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.