Ind vs WI: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మరోసారి పట్టు బిగించింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా, వెస్టిండీస్ ను మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ చేసింది. 248 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియాకు 270 పరుగుల లీడ్ దక్కింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసి దుమ్ము లేపాడు. దీంతో వెస్టిండీస్ అతి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్ లో 516 పరుగులకు డిక్లేర్డ్ చేసింది టీమిండియా.
వెస్టిండీస్ తో జరుగుతున్న ఢిల్లీ టెస్ట్ లో టీం ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యంగ్ కుర్రాడు సాయి సుదర్శన్ కు తీవ్ర గాయం అయింది. దీంతో ఇవాళ ఫీల్డింగ్ కూడా చేయలేదు సాయి సుదర్శన్. వెస్టిండీస్ తో రెండో టెస్టు సందర్భంగా క్యాచ్ పట్టే క్రమంలో యంగ్ క్రికెటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాంప్ బెల్ కొట్టిన అద్భుతమైన షాట్ అందుకున్నాడు సాయి సుదర్శన్. దీంతో నిన్ననే గ్రౌండ్ ను వదిలేసిన సాయి సుదర్శన్… ఇవాళ ఫీల్డింగ్ చేసేందుకు కూడా రాలేదు. అయితే గాయం తీవ్రమైనది కాదని, ముందు జాగ్రత్తలు భాగంగా అతని ఫీల్డింగ్ కు పంపలేదట టీమిండియా యాజమాన్యం. అయితే సాయి సుదర్శన్ డగౌట్ లో కూర్చునడంతో అతని స్థానంలో పడిక్కల్ వచ్చి ఫీల్డింగ్ చేశాడు.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
– First Kuldeep Yadav.
– Then Mohammad Siraj.Absolute Destruction by Team India's bowlers! 💥pic.twitter.com/tKY40cw2RN
— Tanuj (@ImTanujSingh) October 12, 2025