Siddipet Crime: ప్రస్తుతం సమాజం ఎటువైపు పోతుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. పెళ్లయిన రెండు వారాలకే ఆ యువతి గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసి షాకయ్యాడు ఆమె భర్త. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే..
పెళ్లయిన రెండువారాలకే ప్రెగ్నెంట్
పెళ్లింటే ఇద్దరి జీవితాలను కలిపేది. నిండు నూరేళ్లు జీవించేది కూడా. అలాంటి పెళ్లిని అపహాస్యం చేశారు బాలిక తల్లిదండ్రులు. గర్భంతో ఉన్న కూతుర్ని ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. సంచలనం రేపిన ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగులో వెలుగు చూసింది.
ములుగు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు 13 రోజుల కిందట పెళ్లయ్యింది. ప్రస్తుతం ఆమెకు కడుపు నొప్పి విపరీతంగా రావడంతో ఆమె భర్త భయపడ్డాడు. వివాహం జరిగిన రెండు వారాలకు నొప్పి రావడం ఏంటని లోలోల భయపడ్డాడు. ఆమెకి ఏమైనా సమస్య ఉన్నాయా అని నిలదీశాడు. ఆ తర్వాత అనుమానం పెరిగింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి భార్యని తీసుకెళ్లాడు.
ఆసుపత్రికి వెళ్లడంతో అసలు గుట్టు బయటకు
బాలికను పరీక్షించిన డాక్టర్, ఆమె గర్భవతి చెప్పడంతో ఒక్కసారిగా షాకయ్యాడు భర్త. ఇంటికి తీసుకొచ్చి భార్యని గట్టిగా భర్త నిలదీయడంతో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు పలుమార్లు అత్యాచారం చేశారు. ఓ యువకుడి పేరు ఉదయ్ కిరణ్ కాగా, మరో యువకుడు పేరు పవన్ కల్యాణ్.
ఏడాదిగా బాలికను ఆ విధంగా లొంగ దీసుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఇంట్లో గుట్టు బయటపడితే పరువుపోతుందని భావించారు. ఈ క్రమంలో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చివరకు ఏదో విధంగా కూతురికి వివాహం చేశారు. ఈనెల 8న యువతికి కడుపునొప్పి రావడంతో ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ALSO READ: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో నలుగురు మృతి
అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేశారంటూ కొడుకు తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివాహం జరిగిన ఆ బాలిక పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమ్మాయి కుటుంబ సభ్యులపై అబ్బాయి తరపు వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.