BigTV English

Dil Raju OG : ఓజి సక్సెస్.. మెగా ఫ్యాన్స్ తో సంబరాలు జరుపుకుంటున్న దిల్ రాజు

Dil Raju OG : ఓజి సక్సెస్.. మెగా ఫ్యాన్స్ తో సంబరాలు జరుపుకుంటున్న దిల్ రాజు

Dil Raju OG : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఒకప్పుడు దిల్ రాజు అంటేనే బ్రాండ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో సినిమా చేయటం అనేది చాలామందికి ఉన్న ఒక కల. ఈ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే అది 100% ప్రేక్షకులను అలరిస్తుంది అనే సినిమాలను నిర్మించింది ఈ సంస్థ.


రోజులు మారుతున్న కొద్దీ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన మార్కులు వచ్చేసాయి. చాలామంది దర్శకులను పరిచయం చేసిన దిల్ రాజు సినిమాలు చేయడం కూడా తగ్గించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ వంటి సినిమాలు నిరాశపరచడం. వంటి విషయాలు కూడా ఆ బ్యానర్ కు కొంత మైనస్ అయ్యాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

ఓజి సక్సెస్ తో కొత్త ఉత్సాహం 

సినిమాలను నిర్మించడానికి అంటే ముందు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు తన ప్రయాణాన్ని ఇండస్ట్రీలో మొదలుపెట్టారు. డిస్ట్రిబ్యూటర్ గా అమృత అనే సినిమా భారీ లాస్ తీసుకొచ్చింది. అయినా దిల్ రాజు కృంగిపోకుండా కంటిన్యూ అవుతూనే తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా తొలిప్రేమ సినిమా తనను ఎన్నిసార్లు ఆదుకొందో పలు సందర్భాల్లో చెప్పారు దిల్ రాజు.


ఇక రీసెంట్ గా సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఓజీ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను నైజాంలో దిల్ రాజు కొనుక్కున్నారు. సినిమా సక్సెస్ కావడంతో విపరీతమైన లాభాలు వచ్చాయి. ఆ సినిమా సక్సెస్ అనేది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని దిల్ రాజు చెప్పారు.

మెగా ఫ్యాన్స్ తో సంబరాలు 

హైదరాబాదులో కొంతమంది మెగా అభిమానులతో దిల్ రాజు ఓజి సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాని నిన్ననే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి రౌడీ జనార్ధన్ అనే పేరును ఖరారు చేశారు. దీనిని ఓపెన్ గా దిల్ రాజా చెప్పేశారు. దానినే కంటిన్యూ చేస్తారా లేకపోతే మారుస్తారా అనేది త్వరలో తెలుస్తుంది.

మెగా ఫ్యాన్స్ తో సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో మరో అదిరిపోయే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు మరో సినిమా చేయబోతున్నట్లు అభిమానులతో పంచుకున్నారట. గురించి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.

Also Read: Raashi Khanna : పిచ్చి ము***… అయ్యో రాశి ఖన్నా ఎంత పెద్ద మాట అనేసింది?

Related News

Trivikram -Venkatesh: త్రివిక్రమ్ వెంకీ సినిమాకు వెరైటీ టైటిల్… కరెక్ట్ గానే సూటయిందే!

Kantara Chapter1: కదంబల కాలంలో ప్లాస్టిక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ రిషబ్!

Telusu Kada : తెలుసు కదా సెన్సార్ పూర్తి , డ్యూరేషన్ ఎంతంటే?

Raashi Khanna : పిచ్చి ము***… అయ్యో రాశి ఖన్నా ఎంత పెద్ద మాట అనేసింది?

Anand Devarakonda: మరోసారి క్రేజీ కాంబినేషన్, మిడిల్ క్లాస్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Allu Arjun: ప్రైవేట్ హోటల్లో అల్లు అర్జున్ అభిమాన సంఘాలతో మీటింగ్

Srikanth iyengar : ముదిరిన వివాదం, శ్రీకాంత్ అయ్యంగార్ పై మా అసోసియేషన్ కు పిర్యాదు

Big Stories

×