Telusu Kada : ప్రముఖ స్టైలిస్ట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన తెలుసు కదా సినిమాతో దర్శకురాలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అలానే పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది.
ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది. ఈ సినిమా ఒకటి ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. సిద్దు జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నారు. వైవా హర్ష కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఈ రోజుల్లో కుటుంబంతోపాటు కలిసి చూసే సినిమాలు అతి తక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా ఏ సర్టిఫికెట్ వస్తున్న సినిమాలే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యాయి. పెద్ద హీరోలు సినిమాలకి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు అని అంటున్నారు. ఆ పెద్ద హీరోలు ఇప్పుడు ఏ సర్టిఫికెట్ సినిమాలు చేస్తున్నారు. ఏ సర్టిఫికేట్ అంటే కేవలం అసభ్యకరమైన సీన్స్ ఉండటమే కాదు, భారీ వైలెన్స్ ఉండటం కూడా దానిలో భాగమే.
ఈ తరుణంలో తెలుసు కదా చిత్ర యూనిట్ కి క్లీన్ యు అండ్ ఎ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాని అందరూ చూడొచ్చు. ఈ సినిమా డ్యూరేషన్ రెండు గంటల 16 నిమిషాలు. ఇది పర్ఫెక్ట్ రన్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఎవరికి పెద్దగా ఓపికలు ఉండడం లేదు. మూడు గంటలపాటు సినిమా తీశాము అంటే అది విపరీతంగా ఆకట్టుకునేలా ఉండాలి. ఒక్కచోట వేరే ఆలోచన వచ్చినా కూడా ఆడియన్ మొబైల్ లో మునిగిపోతాడు. సినిమాని మర్చిపోతాడు.
తనకున్న టాలెంట్ తో ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుంటూరు టాకీస్ సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు సిద్దు. తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే తను చేసిన డి జె టి టిల్లు సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది.
ఇప్పటికీ కూడా బయట మాట్లాడినప్పుడు సిద్దు అదే స్లాంగ్ ను మెయింటైన్ చేస్తాడు. సినిమాలో అతని టైమింగ్ అద్భుతంగా వర్కౌట్ అయింది. బయట చాలా కామెడీ షోస్ లో కూడా ఆ టైమింగ్ ప్రజెంట్ చేస్తున్నాడు. సిద్దు నటించిన లాస్ట్ ఫిలిం జాక్ ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
సక్సెస్ వచ్చినప్పుడు చుట్టూ పదిమంది ఎలా చేరుతారు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అలానే కామెంట్ చేస్తారు. ఆ కామెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాడు సిద్దు. ఇప్పుడు తెలుసు కదా సినిమాతో కం బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Also Read: Dil Raju OG : ఓజి సక్సెస్.. మెగా ఫ్యాన్స్ తో సంబరాలు జరుపుకుంటున్న దిల్ రాజు