Andhra King Taluka Teaser : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రామ్ ఈ సినిమాతో సక్సెస్ కొడతాడు అని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ కెరియర్ లో సరైన హిట్ సినిమా ఇప్పటివరకు పడలేదు.
మరోవైపు మహేష్ బాబు మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇటువంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత ఇంకో సినిమా తీస్తున్నాడు అంటే అంచనాలు ఉండటం అనేది సహజం. ఇదివరకే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో రామ్ పోతినేని ఉపేంద్ర ఫ్యాన్. సినిమా టీజర్ మొదలవగానే సినిమాకి ఎందుకు తీసుకెళ్లావ్? పిల్లాడిని ఇలానే తీసుకెళ్లి పాడు చేయు అంటూ తులసి వాయిస్ తో టీజర్ స్టార్ట్ అయింది. సినిమాలు చూస్తే ఎవరు పాడైపోతారే అని రావు రమేష్ కౌంటర్ ఇస్తాడు. ఇక్కడితో సినిమా ఎలా ఉండబోతుందో ఒక అవగాహన అయితే వస్తుంది.
రామ్ ఎనర్జీ టీజర్ లో అదిరిపోయింది డైలాగ్ డెలివరీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నీకు నైజాంలో గోచికట్టి, గుంటూరులో కారం పెట్టి, సిడెడ్ లో ఫ్రై చేసి, ఆంధ్రలో పలావు వండేస్తే మొత్తం దిగిపోద్ది. అని అవతల ఫ్యాన్ కి రామ్ ఇచ్చే వార్నింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్ వార్స్ అనేవి ట్విట్టర్లో ఏ రేంజ్ లో జరుగుతున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తిట్టుకునే రేంజ్ కు వెళ్ళిపోయారు. వాళ్లందరికీ ఈ సినిమాలో కనెక్ట్ అయ్యే డైలాగ్ ఒకటి రాశాడు మహేష్ బాబు.
ఫ్యాన్… ఫ్యాన్… అంటూ నువ్వు గుడ్డలు చింపేసుకోవడమే కానీ… నువ్వు ఒకడు ఉన్నావని కూడా… ఆ హీరోకి తెలియదు. ఏం బ్రతుకులురా మీవి.. చీ.చి. ఈ డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది.
ఖచ్చితంగా ఈ డైలాగ్ అనేది చాలామందికి విపరీతంగా కనెక్ట్ అవుతుంది. నిజంగానే హీరోల కోసం ఎన్ని ఫ్యాన్ వార్స్ చేస్తున్నామో వాళ్ల వరకు వెళ్ళవు. వాళ్లు వాళ్లు బానే ఉంటారు. ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా ఒక సందర్భంలో మేము మేము బాగున్నాము మీరే ఇంకా బాగుండాలి అని చెప్పారు.