Period leave Men opinion| కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలలో ఒక రోజు పీరియడ్ లీవ్‌ను ఆమోదించింది. ఇది సంవత్సరానికి 12 రోజుల పెయిడ్ లీవ్. ఇప్పటివరకు పీరియడ్స్ సమయంలో మహిళలు ఆ నొప్పి భరిస్తూనే ఆఫీస్‌కు వెళ్లేవారు. లీవ్ అడగడానికి అసౌకర్యంగా భావించేవారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో కనీసం కొంతమంది మహిళలకు కొంత ఉపశమనం పొందగలరు. కర్ణటాక ప్రభుత్వ నిర్ణయాన్ని.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు స్వాగతించారు. కానీ, ఆఫీసుల్లో, సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. అదే పురుషులు ఈ పీరియడ్ లీవ్ పట్ల ఎలా ఫీలవుతున్నారు?
గురుగ్రామ్ లో పనిచేసే 25 ఏళ్ల కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్ హర్ప్రతీక్ మాట్లాడుతూ.. “మహిళలకు పీరియడ్స్ లీవ్ నిర్ణయాన్ని నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఇది చాలా కాలం ముందే అమలు చేయాల్సిన విషయం. ప్రభుత్వం పీరియడ్ పెయిన్‌ను అధికారికంగా గుర్తించడం వల్ల, ఇది చిన్న సమస్య కాదు – అందరినీ ప్రభావితం చేసే నిజమైన సమస్య అని తెలుస్తుంది.” అని చెప్పాడు.
కొంతమంది పురుషులకు ఇది సులభమైన నిర్ణయం. మరికొందరు దీనిపట్ల ఇంకా అసౌకర్యంగా ఉన్నారు. ఆర్కిటెక్ట్ నమన్ సింగ్ (పేరు మార్చారు) స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలిపాడు. “ఇది పూర్తిగా ఓకే. నొప్పిలో ఉండి ‘ఫైన్’ అని నటించి పని చేయడం కంటే సెలవు తీసుకోవడం మంచిది. కానీ, ఆఫీస్ టెన్షన్, పీరియడ్ సమస్య తో ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేరు.” అని నవ్వాడు.
32 ఏళ్ల మెడికల్ ప్రొఫెషనల్ ఆర్యన్ రాణా అభిప్రాయం: “ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ముందే పరిష్కరించాల్సింది. కానీ, ‘పీరియడ్ లీవ్’ అని ప్రత్యేకంగా చెప్పకూడదు. క్యాజువల్ లీవ్‌గా ఇచ్చి ఉంటే మంచిది. వివాహం తర్వాత నా భార్య పీరియడ్‌లో బాధపడుతున్నట్టు చూసి, మహిళలు రోజు ఎలా జీవిస్తున్నారో తెలిసింది.” అని చెప్పాడు.
మీడియా ముందు మాట్లాడిన పురుషులు పీరియడ్ లీవ్‌ని సమర్థించారు. కానీ, ఆన్‌లైన్‌లో సీన్ మొత్తం మారిపోతుంది. కొంతమంది కోపంగా మాట్లాడుతున్నారు. ఒకరు ఇలా కామెంట్ చేశారు.. “మహిళలు కంపెనీలకు ‘బ్లీడింగ్’ లయబిలిటీ. వాళ్ల పని ప్రొడక్టివిటీ పురుషుల కంటే తక్కువ, ఎస్ట్రోజెన్ వల్ల మూడ్ స్వింగ్స్, మెటర్నిటీ లీవ్‌లు. అందుకే ఆఫీస్‌లో మగవారే ఉంటే మంచిది.
ఇలా చేయడం వల్ల మహిళలకు హారస్‌మెంట్ ఉండదు. ప్రాఫిట్స్ పెరుగుతాయి, పురుషుల సాలరీలు పెరుగుతాయి. స్కర్ట్స్, సారీలు కిచెన్‌లోనే ఉండాలి, పురుషులు పని చేయాలి – పురాతన కాలం జరిగేదే సరైన పద్ధతి. .” మహిళల పట్ల వివక్ష చూపే ఇలాంటి కామెంట్స్ చేసే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. పీరియడ్ లీవ్ పాలసీపై ఈ కామెంట్లు కొందరు మగవారి కోపాన్ని తెలియజేస్తోంది.
మహిళలు స్వాగతిస్తున్నప్పటికీ ఈ నిర్ణయం పట్ల భయం ఉంది. లీవ్ తీసుకుంటే ‘బలహీనులు’ లేదా ‘తక్కువ ప్రొఫెషనల్’ అని జడ్జ్ చేస్తారేమో? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంపెనీలు 12 రోజుల లీవ్ ఇవ్వడం ఒక లయబిలిటీగా భావించి మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు.
HR కన్సల్టెంట్ సూర్య శేఖర్ దేబ్‌నాథ్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. “పీరియడ్ లీవ్ జెండర్ ప్రివిలేజ్ కాదు, హెల్త్ సపోర్ట్. మెంటల్ హెల్త్ డేస్ లేదా పేరెంటల్ లీవ్‌లా. ఉద్దేశం ఫెయిర్‌నెస్, ఫేవరిటిజం కాదు.” భారత్‌లోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి పాలసీలు ఇప్పటికే అమలు చేసి, ప్రొడక్టివిటీ తగ్గలేదని నిరూపించాయని ఆయన తెలిపాడు.
అతను, ఈ లీవ్‌ను జెండర్-న్యూట్రల్ వెల్‌నెస్ ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని, మహిళల మెన్స్ట్రువల్ హెల్త్ గురించి ఎక్కువగా చర్చించాలి. పురుషులు ఈ సమస్య సానుభూతిగా చూడాలని.. ట్రాన్స్‌జెండర్, నాన్-బైనరీల ఆరోగ్య సమస్యలను కూడా చేర్చాలని సూచించాడు. “ఈ సమస్యకు పరిష్కారం పేపర్‌వర్క్ కాదు, ఎడ్యుకేషన్, అవేర్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.” అని చెప్పాడు
ఇలాంటి పాలసీ రూపొందించిన రాష్ట్రం కర్ణాటక మొదటిది కాదు – బిహార్, ఒడిశా, కేరళలో కూడా ఇలాంటి పాలసీలు ఉన్నాయి. కానీ, కర్ణాటక దీనిని ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టర్లలో, MNCs నుంచి గార్మెంట్ ఫ్యాక్టరీల వరకు విస్తరించింది.
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే ఈ చర్య ప్రశంసనీయమే. కానీ, నిజమైన ప్రోగ్రెస్ సానుభూతి మీద, వినడానికి సిద్ధంగా ఉన్న ఆఫీసులు, పురుషుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది పాలసీ మాత్రమే కాదు – గౌరవం, మహిళల బాధలను అర్థం చేసుకోవడం. కేవలం ఇలాంటి ఒక పాలసీతో సమస్య పరిష్కారం కాదు.. అందుకోసం మరిన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు అవసరం.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి