Allu Arjun: తెలుగు హీరోలు రేంజ్ ఈ మధ్యకాలంలో మారిపోయింది. చాలామంది కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయినా వాళ్ళ టాలెంట్ ను నేడు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు.
కేవలం వీళ్లు మాత్రమే కాకుండా నిఖిల్, తేజసజ్జ, సాయి ధరంతేజ్ వంటి హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. అల్లు అర్జున్ రేంజ్ పుష్ప సినిమా తర్వాత విపరీతంగా మారిపోయిన సంగతి తెలిసింది. ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో అందరూ ఒక్కసారి షాక్ గురయ్యారు. పుష్ప సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చాలామంది క్రికెటర్స్, పొలిటీషియన్స్ అంతా కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ లో లేపారు.
అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు వలన ఏర్పడింది. ఒకప్పుడు అల్లు అర్జున్ ను మెగా హీరో గానే చాలామంది పరిగణించేవాళ్ళు. అల్లు అర్జున్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ చిరంజీవి గారి రోడ్డు వేశారు మేము అందరం ఈజీగా నడుచుకుంటూ వచ్చాము అని చెప్పారు.
అప్పట్లో ఏ మెగా హీరో సినిమా ఈవెంట్ జరిగినా కొంతమంది అభిమానులు వచ్చి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం మొదలుపెట్టేవాళ్ళు. ఆయా హీరోలు కూడా వాళ్ల గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సరైనోడు సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు చెప్పను బ్రదర్ అన్నారు.
అక్కడితో అల్లు అర్జున్ సినిమాలను కొంతమంది మెగా ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయడం తగ్గించారు. కొంతకాలం తర్వాత అల్లు అర్జున్ కూడా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు నాకు మాత్రం ఆర్మీ ఉంది అంటూ మాట్లాడడం మొదలు పెట్టేవాళ్ళు. ఒక ప్రైవేట్ హోటల్లో అల్లు అర్జున్ అభిమాన సంఘాలతో మీటింగ్ పెట్టనున్నారు. స్టేట్ వైడ్ ఫ్యాన్స్ తో కమిటీ ఏర్పాటు కోసం ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మీటింగ్ గురించి ఒక వార్త బయటకు వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ మొదలైపోయింది. కొంతమంది అల్లు అర్జున్ కు నిబ్బ నిబ్బి ఫ్యాన్స్ ఉంటారు అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానినే దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఈరోజు సండే కదా, స్కూల్ హాలిడే కాబట్టి వాళ్లతో మీటింగ్ ఉంటుంది అని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
ఏదేమైనా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లీ తో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది.
Also Read: Andhra King Taluka Teaser: అందరు ఫ్యాన్స్ కి టచ్ అయ్యే డైలాగ్ , ఇకనైనా మారుతారా?