Salman Khan:సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీలు పాపులారిటీ వచ్చిన తర్వాత ఎంతలా మారిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమకు ఆ పాపులారిటీ అందించిన అభిమానుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. కేవలం డబ్బు కోసం పక్కదారులు తొక్కుతున్న విషయం తెలిసిందే. కొంతమంది డబ్బు కోసం ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటే.. మరికొంతమంది యువతను బానిసలను చేస్తూ బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తూ.. డబ్బు సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలపై అధికారులు హెచ్చరికలు జారీ చేసినా.. సెలబ్రిటీలు మాత్రం తమ ధోరణి మార్చుకోవడం లేదు అని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ఇప్పుడు కండల వీరుడిగా పేరు సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) కి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ కూడా సల్మాన్ ఖాన్ పై మండిపడుతూ.. ఎన్ని చేసినా ఇక మీరు మారరా? ఎప్పుడూ డబ్బేనా? కనీసం ప్రజల ప్రాణాల గురించి మీరు పట్టించుకోరా? అంటూ మండిపడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హీరో సల్మాన్ ఖాన్ పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు. సల్మాన్ ప్రచారం చేస్తున్న ” రాజ్ శ్రీ పాన్ మసాలా” ప్రకటనలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపిస్తూ.. వినియోగదారుల కోటాలో బీజేపీ నాయకుడు ఇందర్ మోహన్ సింగ్ హనీ సల్మాన్ ఖాన్ పై ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ పాన్ మసాలాలో కుంకుమపువ్వు ఉన్నట్లు ప్రచారం చేయడంపై పిటీషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పిటిషనర్ ఇచ్చిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. సల్మాన్ ఖాన్ కి నోటీసులు జారీ చేసి .. 2025 నవంబర్ 27న సల్మాన్ ఖాన్ విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
also read:Peddi: మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు
ఇకపోతే సల్మాన్ ఖాన్ ఇబ్బందులు, లీగల్ నోటీసులు ఎదుర్కోవడం ఇదేమి మొదటిసారి కాదు.. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలా ప్రకటనల్లో పనిచేసి విమర్శలతో పాటు లీగల్ నోటీసులు కూడా ఎదుర్కొన్నారు. దీనికి తోడు ఇటీవల జాయ్ ఫారం 2025 ఈవెంట్ లో భాగంగా పాకిస్థాన్, బలోచిస్థాన్ రెండింటిని వేరు చేస్తూ చేసిన కామెంట్లు కూడా సల్మాన్ ఖాన్ పై వ్యతిరేకత కలిగించాయి. కొంతమంది సల్మాన్ ఖాన్ ను సమర్ధిస్తే .. మరి కొంతమంది పాకిస్తాన్ నుండి సల్మాన్ ఖాన్ బలోచిస్థాన్ ను వేరు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ ఇలా పలుమార్లు తన మాటలతో, చేష్టలతో ఇబ్బందులు ఎదుర్కోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.