BigTV English
Advertisement

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Dies Irae Trailer :  ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Dies Irae Trailer : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరో ప్రస్తుతం కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. ఈయన వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.. ‘హృదయం’తో ఆయన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో నటిస్తున్న మూవీ ‘డీయస్ ఈరే’ భూతకాలం’, ‘భ్రమ యుగం’ వంటి హారర్ హిట్స్ తీసిన రాహుల్ సదాశివన్ ఈ ‘డీయస్ ఈరే’కు దర్శకుడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ ని టీం మొదలుపెట్టారు.. ఇందులో భాగంగా సినిమా నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


మైండ్ బ్లాక్ అయ్యే సీన్లతో ట్రైలర్..

హారర్ కామెడీ సినిమాలకు కొదవలేదు. ఇటీవల వస్తున్న సినిమాలన్నీ కూడా ఇలాంటి జోనర్ లోనే రావడంతో ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ‘డీయస్ ఈరే’ కూడా అలాంటి జోనర్ లోనే రాబోతుందని ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ను చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. థ్రిల్లర్ సీన్లతో గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ తో ట్రైలర్ అదిరిపోయింది.వెన్నులో వణుకుపుట్టించే మ్యూజిక్ ఆత్మ ఎంట్రీ ఇచ్చే సీన్ ప్రేక్షకులను భయపెట్టేలా కనిపిస్తుంది. ఆత్మ మనుషుల పై కోపం వస్తే ఏం చేస్తుంది.. పగను తీర్చుకుంటుందా అనే అంశం మాత్రం హైలెట్ కానుంది. మొత్తానికి ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. దీంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. మరి సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి..

Also Read : బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇందులో రోషన్ పాత్రలో నటిస్తున్నాడు. తండ్రి పెద్ద వ్యాపారవేత్త. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. స్నేహితులతో కలిసి పార్టీలు, సరదాలు అంటూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే తన క్లాస్మేట్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలుసుకొని తన కుటుంబీకులను పరామర్శించడానికి హీరో అక్కడికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఆ హీరో ఇంటికి ఆత్మ వచ్చి చేరుతుంది. ఆమె ఆత్మ తనను వేధిస్తోందనేది రోహన్‌ ఫీలింగ్. ఆమె ఆత్మ ఎందుకు తనని వేధిస్తుంది.? నిజంగానే ఆత్మ ఉందా లేకపోతే తన ఫీలింగా అని తెలుసుకునేందుకు ఆమె స్నేహితుడి సలహాలు తీసుకుంటాడు. అతనితో కలిసి ఆత్మ నిజంగానే ఉందా లేదా అని రోషన్ కనుక్కుంటాడు.. అయితే ఆమె తమ్ముడు కూడా చనిపోవడంతో ఆత్మకి ఏం కావాలో అర్థం కాక రోషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఈ సినిమా స్టోరీ.. ఇంతకీ ఆత్మ ఎందుకు రోషన్ దగ్గరే ఉంటుంది? రోషన్ కి ఆమె సూసైడ్ వెనక ఏదైనా సంబంధం ఉందా..? వీటిపై క్లారిటీ రావాలంటే సినిమాని థియేటర్లలో చూడాల్సిందే..

Related News

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Big Stories

×