Hyderabad: ఇదెక్కడి వింత రా బాబు.. చట్నీ పడిందని చంపేస్తారా.. రాష్ట్రంలో రోజు రోజుకు ప్రజలు మితిమీరి ప్రవరిస్తున్నారు. ఏదైన జరిగితే ఆలోచించడం మానేసి చంపడమే పరిష్కారమనుకుంటున్నారు. అసలు ఎందుకు చంపేస్తున్నారో.. ఎందుకు చనిపోతున్నామే వారికే తెలియకుండా జరుగుతుంది. ఇది అంతా ఎందుకంటే హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. చట్నీ మీద పడేశాడని లిఫ్ట్ ఇచ్చి మరి కత్తితో నరికి చంపేశారు.
అయితే హైదరాబాద్ నాచారంలో దారుణ హత్య జరిగింది. దారి మద్యలో లిఫ్ట్ ఇచ్చిన యువకులతో చిన్న మాట ఆ వ్యక్తి నిండు ప్రాణం తీసింది. ఎల్బీనగర్‌లో మద్యం సేవించి ఉన్న 45 ఏళ్ల మురళీకృష్ణకు ముగ్గురు యువకులు కారులో లిఫ్ట్ ఇచ్చారు. అయితే కారులో వారికి మాటల యుద్ధం మొదలవుతుంది. అంతేకాకుండా ఉప్పల్‌లో టిఫిన్ కోసం ఆగుతారు. ఆగిన తర్వాత టిఫీన్ చేస్తుంటే ఒక వ్యక్తిపై ‘చట్నీ పడటం’ పడుతుంది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యాడు.
Also Read: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..
చట్నీ పడటం అనే చిన్న విషయంలో మళ్లీ యుద్ధం రాజుకుంది. దీంతో ముగ్గురు యువకులు కలిసి మురళీకృష్ణపై దాడి చేశారు. ప్రతిగా మురళీకృష్ణ కూడా దాడికి దిగడంతో… వారిలో ఒక యువకుడు కత్తితో మురళీకృష్ణను పొడిచి చంపాడు. యువకుల దాడిలో కొంత దూరం పరుగెత్తి మృతి చెందుతాడు మురళీకృష్ణ. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్టు గుర్తించారు.
దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య!
హైదరాబాద్ నాచారం పరిధిలో చోటు చేసుకున్న ఘటన
ఎల్బీనగర్ వద్ద కారులో వెళ్తున్న యువకులను లిఫ్ట్ అడిగిన మురళీకృష్ణ అనే వ్యక్తి
టిఫిన్ కోసం ఉప్పల్‌లో కారు ఆపిన యువకులు
లిఫ్ట్ ఇచ్చినవారిపై పొరపాటున చట్నీ పడేసిన మురళీకృష్ణ
ఈ క్రమంలో… pic.twitter.com/dFJnoNSqTh
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2025