Delhi Politics: ఓట్ చోరీ వ్యవహారంపై మరో బాంబు పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అనేక విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా ఓట్ చోర్ విషయంలో అక్కడ కేంద్రంలోని బీజేపీ పెద్దలు వ్యవహరించిన తీరుని తూర్పారబట్టారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త విషయాలను బయటపెట్టారు.
ఓట్ల చోరీపై హైడ్రోజన్ ఫైల్స్
దేశంలో జరుగుతున్న ఓట్ చోరీపై బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ. ఓట్ చోరీపై వివిధ రాష్ట్రాల్లో జరిగిన వ్యవహారాలను బయటపెట్టారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయని తెలిపారు. పోలైన పోస్టల్ ఓట్లకు-ఫలితాలకు తేడా ఉందన్నారు.
కేవలం హర్యానాలో మాత్రమే కాదని, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీ అయినట్టు తెలిపారు. దానికి సంబంధించి డేటాను మీడియా ముందు పెట్టి వివరించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ యువతికి 10 బూత్‌లలో 22 ఓట్లు ఉన్నాయన్నారు. ఆ యువతి బ్రెజిల్‌కు చెందిన మోడల్‌గా గుర్తించామన్నారు. యూపీలోని చాలామంది హర్యానాలో ఓటు వేశారని గుర్తు చేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది ఇదే-రాహుల్
బ్రెజిలియన్ మోడల్ మాథ్యూస్ ఫెర్రెరోకు సీమా, స్వీటీ రకరకాల పేర్లతో ఓటర్ల జాబితాలో ఉన్నారని, ఆమె ఓటు వేశారని కీలక విషయాలు బయటపెట్టారు. ఓటరు జాబితాలోని కొన్ని అంశాలపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 22,000 ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. మహిళ ఎవరు? కేంద్రం నుంచి ఈ ఆపరేషన్ మొదలైందని విమర్శించారు.
హర్యానా ఓటర్ల జాబితాలోని ప్రతీ ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీ ఉన్నారని గుర్తు చేశారు. ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాలో నకిలీ శాతం 12.5 శాతంగా తేల్చారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-55,48,800 ఓట్లు వచ్చాయన్నారు. దాదాపు 39.94 శాతం అన్నమాట. కాంగ్రెస్ కూటమికి 54,64,975 ఓట్లు వచ్చాయని, దాదాపు 39.34 శాతం అన్నమాట.
ALSO READ: రైల్వే స్టేషన్ లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన రైలు
ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 83,825 ఓట్లు మాత్రమే. అంటే 0.60 శాతం. బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 37 సీట్లు వచ్చాయన్నారు. ఫలితాల తర్వాత చాలా మంది పార్టీ అభ్యర్థులు ఏదో తప్పు జరిగిందని తమ దృష్టికి తెచ్చారన్నారు రాహుల్‌గాంధీ. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని, కానీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ 8 నియోజకవర్గాలు చాలా తక్కువ తేడాతో కోల్పోయిందన్నారు. వాటిలో ఓ నియోజకవర్గంలో కేవలం 32 ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. ఈ తేడాలు కలిపి 22,779 ఓట్లుగా తేల్చారు. ఆ లెక్కన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 22 వేల 779 ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే మహిళ ఫోటోతో 100 ఓటరు ఐడీలను బయటపెట్టారు.
ఇలాంటివి బయటపడతాయే కారణంతో ఎన్నికల కమిషన్ బూత్‌ల సీసీటీవీ ఫుటేజ్‌ను నాశనం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం తలచుకుంటే ఒక్క క్షణంలో నకిలీ ఓటర్లను తొలగించగలదని, వారెందుకు ఈ పని చేయలేదని ప్రశ్నించారు. బీజేపీకి సహాయం చేస్తున్నట్లుగా వర్ణించారు. ఓటు దొంగలను సీఈసీ కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందన్నారు.
ఓటు చోరీపై రాహుల్ గాంధీ మీడియా సమావేశం
జాతీయ స్థాయిలో భారీ ఎత్తున ఓటు చోరీ జరిగింది
బీజేపీ లీడర్లతో సహా చాలా మందికి యూపీలో, హర్యానాలో ఓట్లు ఉన్నాయి
హర్యానాలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి
ఓటు దొంగలను సీఈసీ కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోంది
హర్యానా ఫలితాలను చూసి షాక్… pic.twitter.com/rQfJHP5UGD
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2025