NTR: ఈమధ్యకాలంలో ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తాన్ని భయపెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఎలా ఉండే ఎన్టీఆర్ .. ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది అందరికీ తెల్సిందే. సాధారణంగా హీరోలు అన్నాకా.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ మారుస్తూ ఉంటారు. ఒకసారి బరువు పెరిగి కనిపిస్తారు.. ఇంకోసారి బరువు తగ్గి కనిపిస్తారు. అందులో ఎలాంటి తప్పు లేదు.. ఎలాంటి భయం లేదు. కానీ ఎన్టీఆర్ లుక్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది సినిమా కోసం తగ్గినట్లుగా అనిపించడం లేదు అనేది ఫ్యాన్స్ వాదన.
ఒక వ్యక్తి బరువు తగ్గితే.. ముఖంలో ఉన్న కళ పోదు. అంతెందుకు.. శర్వానంద్ బరువు తగ్గాడు.. కానీ, అతని ముఖంలో ఉన్న ఛార్మ్ అలాగే ఉంది. కానీ, ఎన్టీఆర్ విషయంలో అలా లేదు. ఒక్కసారిగా ఎన్టీఆర్ రూపురేఖల్లో మార్పులు వచ్చాయి. ఎలా అంటే.. ఒక్కసారిగా ఆరోగ్యంగా ఉన్న మనిషి, అనారోగ్యానికి గురైతే ఎలా ఉంటాడో అలా మారిపోయాడు. సడెన్ గా చూసి ఫ్యాన్సే.. ఎన్టీఆర్ ను గుర్తుపట్టలేకపోయారు అంటే ఆశ్చర్యపోనవరసం లేదు. అసలు ఒకప్పుడు ఎన్టీఆర్ ఎంత అందంగా ఉండేవాడో.. ఇప్పుడు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఎన్టీఆర్ లుక్ ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతుంది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా కొద్దిగా పర్వాలేదనిపించిన ఎన్టీఆర్ లుక్.. ఉన్నా కొద్దీ దారుణంగా తయారవుతుంది. మొన్నటికి మొన్న నార్నే నితిన్ పెళ్ళిలో కూడా ఎన్టీఆర్ అంతే సన్నబడి కనిపించాడు. ఆ తరువాత ఒక ఫ్యాన్ తో దిగిన ఫొటోలో అయితే అసలు మరీ దారుణంగా కనిపించాడు. ఇక నిన్న రిలీజ్ అయిన శివ ట్రైలర్ లో స్టార్స్ అందరూ మాట్లాడారు. అందులో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ భయపడడం స్టార్ట్ చేశారు. అసలు ఎన్టీఆర్ కి ఏమైంది.. ? ఎందుకు ఇలా మారిపోయాడు.. ? అని భాద పడుతున్నారు.
అయితే ఇదంతా ఎన్టీఆర్ చేసేది నీల్ సినిమా కోసమే అని తెలుస్తోంది. ఎంత భాద పడినా.. నీల్ తన సినిమాలో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కొంపతీసి ఈ శివ ట్రైలర్ లో వచ్చినట్లు అయితే కాదుగా అని భయపడుతున్నారు.. అయితే రిలాక్స్ బాయ్స్.. ఆ వీడియోను ఆగస్టులో షూట్ చేశారట. ఇప్పటికీ ఎన్టీఆర్ లో చాలా మార్పులు వచ్చే ఉంటాయి. కంగారుపడకండి.. నీల్ మావా మంచి అవుట్ పుట్ ఇస్తాడు అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి నీల్ మావా కాపాడతాడో లేదో చూడాలంటే డ్రాగన్ ఫస్ట్ లుక్ వచ్చేవరకు వేచి చూడక తప్పదు.