Vijayashanti:విజయశాంతి (Vijayashanti) లేడీ సూపర్ స్టార్ గా.. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతోంది. అయితే అలాంటి విజయశాంతి సినిమాల్లో రాణిస్తున్న తరుణంలోనే రాజకీయాల్లోకి అడుగులు పడడానికి కారణం ఏంటి..? విజయశాంతి రాజకీయ ఎంట్రీ వెనుక ఎవరి హస్తం ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
విజయశాంతిని స్టార్ గా నిలబెట్టిన చిత్రాలు..
సీనియర్ నటి విజయశాంతి ఓపక్క స్టార్ హీరోలతో జోడి కడుతూనే మరోపక్క లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది.అలా విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ, అడవి చుక్క(Adavi Chukka), వైజయంతి (Vyjayanthi),కర్తవ్యం (Karthavyam) వంటి ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
విజయశాంతి రాజకీయ ఎంట్రీ వెనుక ఆయన హస్తం..
అయితే అలాంటి విజయశాంతి సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న తరుణంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అలా ఈమె రాజకీయ ఎంట్రీ వెనుక దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) హస్తం ఉందని అంటూ ఉంటారు.దానికి కారణం ఒసేయ్ రాములమ్మ మూవీ(Osey Ramulamma Movie)నట. మరి విజయశాంతి రాజకీయ ఎంట్రీ కి.. దాసరి నారాయణరావుకి.. ఈ ‘ఒసేయ్ రాములమ్మ’ మూవీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో? ఇప్పుడు చూద్దాం.
దాసరి మాటలతో విజయశాంతి కెరీరే మారిపోయిందా?
1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమా.. ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే మొదట్లో ఈ సినిమా టైటిల్ విషయంలో విజయశాంతి కాస్త హర్ట్ అయ్యిందట. ఎందుకంటే ఒసేయ్ రాములమ్మ అనే టైటిల్ పెడితే తన ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనని డైరెక్ట్ గా దర్శకుడు దగ్గరికి వెళ్లి ఈ సినిమా టైటిల్ తీసేయండి. నాకస్సలు నచ్చలేదు. నా అభిమానులు ఈ టైటిల్ పెడితే ఒప్పుకోరని చెప్పిందట. కానీ డైరెక్టర్ మాత్రం మన కాంబోలో రాబోయే ఈ సినిమాకి విశేష ప్రేక్షకాదరణ దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటి సినిమా టైటిల్ లేదు. అలాగే మిగతా టైటిల్స్ అన్నింటిని ఒసేయ్ రాములమ్మ టైటిల్ డామినేట్ చేస్తుందని చెప్పారట. ఇక దర్శకుడు అంతగా చెప్పడంతో వద్దంటే ఏం బాగుంటుందని కన్విన్స్ అయిన విజయశాంతి ఒసేయ్ రాములమ్మ సినిమాకి ఒప్పుకుందట.
విజయశాంతి రాజకీయ జీవితం ఆ సినిమాతో ముడిపడిందా?
1997లో విడుదలైన ఒసేయ్ రాములమ్మ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడే ఒక దళిత మహిళ మామూలు మహిళ నుండి నక్సలైట్ గా మారి భూస్వాములను ఎలా అంతమొందించిందనే కాన్సెప్ట్ ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో విలన్ గా రామిరెడ్డి(Rami Reddy) అదరగొట్టారు.దాసరి నారాయణరావు కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. అంతేకాకుండా ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ (Vandematharam Srinivas) ఇచ్చినా మ్యూజిక్, ఆయన పాడిన పాటలన్నీ మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ఇక ఒసేయ్ రాములమ్మ సినిమా విడుదలయ్యాక విజయశాంతిని అందరూ రాములమ్మ (Ramulamma) అని పిలవడం మొదలు పెట్టారు. అంతేకాదు ఈ సినిమా విడుదలయ్యాకే విజయశాంతి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.
విజయశాంతి రాజకీయ జీవితం..
అలా 1997లో ఒసేయ్ రాములమ్మ సినిమా విడుదలైతే 1998లో బిజెపి (BJP) పార్టీలో చేరి ఆ తర్వాత టిఆర్ఎస్(TRS) పార్టీలోకి మారి, ఆ తర్వాత మళ్లీ బిజెపి గూటికే చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతోంది. అలా విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమా తర్వాతనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయశాంతి రాజకీయల్లోకి రావడంలో దాసరి నారాయణరావు హస్తం ఉందని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు.
Also read: 8 Vasantalu Collections : అర్హత ఉన్నోడి సినిమా… అర కోటి కూడా కలెక్షన్లు రాలేదు