Vivo Y400 Pro 5G| ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో.. ఇటీవలే వివో వై సిరీస్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ వై సిరీస్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరలోనే ఉండడం విశేసం. ముఖ్యంగా వివో Y400 ప్రో 5G ఫోన్ లో పవర్‌ఫుల్ 5,500mAh బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, 50MP కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా, గూగుల్ సర్కిల్-టు-సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగులలో—ఫ్రీ స్టైల్ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబులా పర్పుల్—లభిస్తుంది. ఇది వివో మునుపటి మోడల్ Y200 ప్రో యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా చెప్పవచ్చు.
వివో Y400 ప్రో 5G ధర వివరాలు
వివో Y400 ప్రో 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB. ఈ ఫోన్ ధర 24,999 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అత్యధిక వేరియంట్ ధర 26,999 రూపాయలు. ప్రస్తుతం ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది, కొనుగోలు చేసేవారికి 2,500 రూపాయల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్‌ను వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ షాపులు, లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వివో Y400 ప్రో 5G ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ IP65 రేటింగ్‌తో వస్తుంది. అంటే వాటర్, డస్ట్ రెసిస్టెంట్ అన్నమాట. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. ఇది 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో 6.77-అంగుళాల కర్వడ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్.. 4,500 నిట్స్ మాక్సిమమ్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కెపాసిటివ్ మల్టీ-టచ్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇవి యూజర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తాయి.
కెమెరా వివరాలు
వివో Y400 ప్రో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ కెమెరాలు అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయడానికి సహాయపడతాయి.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ ఫోన్ డ్యూయల్ 5G సిమ్ కార్డ్ సపోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి. ఈ ఫీచర్లు యూజర్లు ఎల్లప్పుడూ కనెక్ట్‌లో ఉండేలా చేస్తాయి.
Also Read: అలెక్సా అన్నీ వింటోంది.. ఇంట్లో స్మార్ట్ డివైజ్‌లుంటే ఈ జాగ్రత్తలు పాటించండి
వివో Y400 ప్రో 5G సరసమైన ధరలో ఆధునిక ఫీచర్లను కోరుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. దీని శక్తివంతమైన బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే, AI-ఆధారిత ఫీచర్లు దీన్ని మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ ఫోన్ యువతకు, విద్యార్థులకు, బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి సరైన ఎంపికగా ఉంటుంది.