BigTV English

8 Vasantalu Collections : అర్హత ఉన్నోడి సినిమా… అర కోటి కూడా కలెక్షన్లు రాలేదు

8 Vasantalu Collections : అర్హత ఉన్నోడి సినిమా… అర కోటి కూడా కలెక్షన్లు రాలేదు

8 Vasantalu Collections..కేరళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanil Kumar) లీడ్ రోల్ పోషిస్తూ.. నేటితరం యువతకు కనెక్ట్ అయ్యేలా ప్యూర్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన చిత్రం 8 వసంతాలు (8 Vasanthalu). భారీ అంచనాల మధ్య జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఒక వర్గం ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అయితే సినిమా ప్రేక్షకులను అలరించింది కానీ అదే ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడంలో చిత్ర బృందం విఫలం అయ్యిందనే వార్తలు తాజా కలెక్షన్లను చూస్తే అర్థమవుతున్నాయి.


8 వసంతాలు ఫస్ట్ డే కలెక్షన్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా మొదటి రోజు రూ.0.5 కోట్లు కూడా రాబట్టలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూసి.. ఈ చిత్ర డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి (Phanindra narsetti)పై నెటిజన్స్ భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.


అర్హత ఉన్నోడి సినిమాకైనా అరకోటి రావాలిగా?

ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ చూసి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టీ పై నెటిజన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ ట్రోల్స్ చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే.. మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో కమలహాసన్ (Kamalhassan ) హీరోగా వచ్చిన ‘థగ్ లైఫ్ ‘ సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా బాగాలేదు అని మణిరత్నంపై చాలామంది ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో ఈ 8 వసంతాలు డైరెక్టర్ ఫణీంద్ర..”అర్హత లేనోడు కూడా సినిమాను జెడ్జ్ చేస్తున్నాడు” అంటూ కామెంట్ చేశాడు. ఇప్పుడు 8వసంతాలు సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో.. “ఆ అర్హత ఉన్నోడు, సినిమా అంటే బాగా తెలిసినోడు సినిమా చేశాడు. అది డిజాస్టర్ అవుతోంది. కనీసం అర్హత ఉన్నోడి సినిమాకి అరకోటి అయినా కలెక్షన్లు రావాలి కదా” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఫణీంద్ర పై నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

8 వసంతాలు బిజినెస్ లెక్కలు..

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సుమారుగా రూ.12 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదల కు ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా దాదాపు రూ.9కోట్లు రిటర్న్ వచ్చేసాయి. అయితే ఈ సినిమాకు థియేటర్ బిజినెస్ ఏమీ జరగలేదు.. ఎందుకంటే రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ లెక్కన సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారే రిలీజ్ చేశారు. ఇప్పుడు సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది కాబట్టి థియేటర్ల నుంచి రూ.3కోట్లకు పైగా షేర్ రావాలి. అలా రూ.3కోట్ల నెట్ కలెక్షన్లు వస్తే ఈ సినిమా సేఫ్ అవుతుంది. వాస్తవానికి థియేటర్లలో ఒక వర్గం ఆడియన్స్ ను.. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకోవడంతో రూ.3కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ రూ.3కోట్లు త్వరగా రాబడితే ఫణీంద్ర పై వచ్చే ట్రోల్స్ ఈజీగా ఆగుతాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

also read: Film industry: హీరో హీరోయిన్లకు ఇది పరీక్ష… నిర్మాతల అఫిడవిట్ లో సైన్ చేయాల్సిందే?

 

Related News

Mass Jathara Teaser : మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఈ సారి చాలా వైల్డ్‌గానే రియాక్ట్ అయ్యాడు

Upasana Konidela : రామ్ చరణ్ తో పెళ్లికి ముందే డేటింగ్.. సీక్రెట్ రీవిల్ చేసిన ఉపాసన…

NTR vs Balayya : బాబాయ్ పక్కన లేడా ? సక్సెస్ తర్వాత తారక్ రాగం మారిందా ?

Upasana: క్లీంకారా డైలీ ఫుడ్ అదే.. లేకుంటే అంతే సంగతి అంటూ!

Coolie Movie : రిలీజ్ కు ముందే ‘కూలీ ‘ హిట్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే..?

Comedian : చీపురుతో కొట్టిన భార్య… అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమెడియన్

Big Stories

×