Idly Kadai : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ధనుష్ సినిమాలు చేసినంత ఫాస్ట్ గా ఇంకో హీరో చేయడం లేదు అనేది వాస్తవం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. అతి త్వరగా 50 సినిమాలను పూర్తి చేశాడు ధనుష్. ఒక ప్లానింగ్ ప్రకారం సినిమా చేయడం ధనుష్ అలవాటు చేసుకున్నారు.
ధనుష్ ఫ్యాన్స్ కి వరుసగా ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు. ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకుడుగా, అలానే సింగర్ గా కూడా ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేస్తున్నాడు. ధనుష్ ఎంత బాగా పాడుతాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా పలు సందర్భాలలో ధనుష్ పాటలు పాడారు. అంతేకాకుండా ధనుష్ అద్భుతంగా రాయగలరు.
ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్
ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ధనుష్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన రాయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంత బాగా సినిమాను డిజైన్ చేశాడని చాలామందికి ఆశ్చర్యం కలిగింది. రీసెంట్గా వచ్చిన నీక్ సినిమా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇదే సినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పేరుతో విడుదలైంది. ఒక ప్రస్తుతం ఇడ్లీ కడై సినిమాలో ధనుష్ ఒక పాటను రాశారు. ఆ పాటను ధనుష్ మరియు శ్వేతా మోహన్ పాడుతున్నారు. ఇదివరకే వీరిద్దరూ కలిసి సార్ సినిమాలో సాంగ్ పాడారు. మాస్టారు మాస్టారు అనే ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ అదే కాంబినేషన్ జీవి ప్రకాష్ దర్శకత్వంలో పడబోతున్నట్లు, ప్రకాష్ అధికారికంగా అనౌన్స్ చేశాడు.
The first single from #Idlykadai will be a love song …. Sung by our dearest @dhanushkraja sir and shwetha mohan…. Written by our @dhanushkraja sir …. It’s my favourite trk from the album … 🎶 🧑🍳🔥🙌 pic.twitter.com/M3SmpkO6J7
— G.V.Prakash Kumar (@gvprakash) July 22, 2025
ఇడ్లీ కడై భారీ స్టార్ కాస్ట్
ఇడ్లీ కడై సినిమాను ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో, డాన్ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. స్వతహాగా రచన, దర్శకత్వం ధనుష్ చేయడంతో క్యూరియాసిటీ చాలామందికి పెరిగింది. ఈ సినిమాలో ధనుష్ మరియు నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు, వీరితో పాటు అరుణ్ విజయ్ , షాలిని పాండే , సత్యరాజ్ , పార్థిబన్ , పి. సముద్రఖని మరియు రాజ్‌కిరణ్ వంటి ప్రముఖ నటులు నటించారు . ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. రీసెంట్గా కుబేర సినిమాతో ధనుష్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.కుబేర తర్వాత ధనుష్ చేస్తున్న సినిమా ఇది.
Also Read: Coolie : భారీ ట్విస్ట్ ఇచ్చిన లోకేష్, కూలీ సినిమాలో కమల్ హాసన్ ?