Ranga Sudha: టాలీవుడ్ హీరోయిన్ రంగ సుధ తన మాజీ లవర్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని, తన ఫోటోలను వాడి అసభ్యకర పోస్టులు క్రియేట్ చేసి ట్విట్టర్, ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారని రాధాకృష్ణతో పారు మరో కొన్ని ట్విట్టర్ పేజీల నిర్వాహకులపై ఆమె ఫిర్యాదు చేసింది.
రాధాకృష్ణ, తాను గతంలో రిలేషన్ లో ఉన్నామని, అప్పుడు తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు చూపించి బెదిరిస్తున్నాడని, కొంతమంది ట్విట్టర్ పేజీ నిర్వాహకులతో కలిసి తన ఫొటోస్ ను మార్ఫ్ చేసి పెడుతున్నారని ఫిర్యాదులో తెలిపింది. ఇక అతని బాధ భరించలేక పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
Pongal 2026: సంక్రాంతి రేస్ లో శర్వా కూడా.. ఎన్ని సినిమాలు దింపుతార్రా బాబు
ఇక రంగ సుధ ఫిర్యాదుపై పోలీసులు పాజిటివ్ గా స్పందించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి రాధాకృష్ణ, మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అమ్మయిలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రంగ సుధ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సేర్. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. మలయాళంలో హీరోయిన్ గా మారింది. తేరి మేరీ అనే మలయాళ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది.
సోషల్ మీడియాలో రంగ సుధకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో 9 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక నిత్యం ట్విట్టర్ లో ఆమె హాట్ హిట్ ఫోటోషూట్స్ ను చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సిగరెట్ కాలుస్తున్న ఒక వీడియో బయటపడింది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఎంతో పద్దతిగా ఉండే ఈమె.. ఇలాంటి పనులు చేస్తుందేంటి అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరి ఆ వీడియో నిజమో కాదో తెలియాల్సి ఉంది.