Vishaka News: ఎన్ని చట్టాలు వచ్చిన.. మహిళలకు మాత్రం భద్రత దోరకడం లేదు.. మహిళ బయటకు వెళ్లిందంటే ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేకుండా పోతుంది. అది ఎవరైనా సరే.. చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే విశాఖలో ఇలాగే కీచకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు దుండగులు.
విశాఖలో రెచ్చిపోయిన కీచకులు.. మూగ బాలికపై అత్యాచారం
ఈ ఘటన ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితులు మద్యం మత్తులో ఉండగా, ఈ దుష్కృత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను పొదల్లోకి తీసుకెళ్లి, ఆమె నిరసనలను, బతిమాలికలను పట్టించుకోకుండా ఈ ఘోర చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో భయాందోళనలను రేకెత్తించింది.
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాధిత బాలిక తల్లిదండ్రులు ఈ ఘటన గురించి తెలుసుకుని, వెంటనే 112 నంబర్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. ద్వారక పోలీసులు సత్వరమే స్పందించి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: బాలికల హాస్టల్‌లోకి బీరు బాటిల్.. ఆగ్రహించిన తల్లిదండ్రులు
నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మూగ బాలిక వంటి అసహాయ స్థితిలో ఉన్న వారిపై ఇటువంటి దాడులు చేశారంటే వారు ఎంత కీచకులు అయ్యుంటారో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ప్రజలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత బాలికకు ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె కుటుంబానికి సమాజం నుండి, పోలీసుల నుండి మద్దతు అందుతోందని చెబుతున్నారు.
రెచ్చిపోయిన కీచకులు.. మైనర్ మూగ బాలికపై అత్యాచారం!
విశాఖ-ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం
మద్యం మత్తులో మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులు
ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి 11 ఏళ్ల మైనర్ మూగ బాలికపై అత్యాచారం
తననేం చేయొద్దని బతిమిలాడినా… pic.twitter.com/EvBKAsU3bY
— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025